అమెరికాలో టీకా పంపిణీ షురూ.. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పారంటే..
అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కరోనాతో బాధపడుతున్న దేశానికి ఇక ఉపశమనం లభించనుంది.
అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కరోనాతో బాధపడుతున్న దేశానికి ఇక ఉపశమనం లభించనుంది. అత్యవసర వినియోగానికి ఫైజర్ టీకాకు పుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వడంతో అధికారులు టీకా పంపిణీ ప్రారంభించారు. టీకా తొలి డోసు ఓ నర్సుకు అందించారు. దీంతో క్వీన్స్‌లోని లాంగ్ ఐలాండ్ యూదు మెడికల్ సెంటర్‌లో నర్సుగా పనిచేస్తున్న సారాలిండ్సే అమెరికాలో తొలి టీకా పొందిన వ్యక్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీకా వేసుకున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించారు. దీంతో తనకు ఉపశమనం కలుగుతుందని చెప్పారు. టీకా రావడంతో అమెరికాలో కొవిడ్‌కు ముగింపు పలికినట్లే అని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రజలు వ్యాక్సిన్ వచ్చిందా కదా అని కరోనా నిబంధనలు ఉల్లంఘించవద్దన్నారు. ప్రజలు మాస్క్ ధరించడం. భౌతిక దూరం పాటించి, ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని సూచించారు.
ఫైజర్ సీఈవో అల్బెర్ట్ కూడా టీకా వేయించుకొని ప్రజల్లో నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. వ్యాక్సిన్ రావడంతో అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియా కేంద్రంగా ఆనందం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ వరల్డ్, కంగ్రాట్స్ అమెరికా అంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు పెట్టారు. ఇక నుంచి కరోనాతో మృతిచెందడం తమ దేశంలో ఉండదని ప్రకటించారు.