సైన్యం చెంతకు ఎంహెచ్-60ఆర్ యుద్ధ హెలికాప్టర్లు..
న్యూఢిల్లీ : ఎంహెచ్-60ఆర్ యుద్ధ హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. సుమారు 24 హెలికాప్టర్లను అమెరికా మనకు అమ్మనున్నది. భారత్‌కు ఈ హెలికాప్టర్లను అమ్మేందుకు అమెరికా కాంగ్రెస్ కూడా అంగీకరించింది. ఎంహెచ్-60ఆర్‌లను మల్టీ మిషన్ హెలికాప్టర్లుగా పిలుస్తారు. వీటినే సీహాక్ చాపర్స్ అని అంటారు. జలాంతర్గాములను, నౌకలను ట్రాక్ చేసి, అటాక్ చేసే సత్తా వీటి సొంతం. అమెరికా, భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు జరగనున్నది. ఈ హెలికాప్టర్లతో భారత్ […]

న్యూఢిల్లీ : ఎంహెచ్-60ఆర్ యుద్ధ హెలికాప్టర్లు భారత్‌కు రానున్నాయి. సుమారు 24 హెలికాప్టర్లను అమెరికా మనకు అమ్మనున్నది. భారత్‌కు ఈ హెలికాప్టర్లను అమ్మేందుకు అమెరికా కాంగ్రెస్ కూడా అంగీకరించింది. ఎంహెచ్-60ఆర్‌లను మల్టీ మిషన్ హెలికాప్టర్లుగా పిలుస్తారు. వీటినే సీహాక్ చాపర్స్ అని అంటారు. జలాంతర్గాములను, నౌకలను ట్రాక్ చేసి, అటాక్ చేసే సత్తా వీటి సొంతం. అమెరికా, భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఈ యుద్ధ హెలికాప్టర్ల కొనుగోలు జరగనున్నది. ఈ హెలికాప్టర్లతో భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరుచుకుంటుందని అమెరికా వెల్లడించింది. ఈ కొనుగోలులో లాక్‌హీడ్ మార్టిన్ ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉంటుంది. ఈ డీల్ విలువ సుమారు 260 కోట్ల డాలర్లు అని పేర్కొంది.



