AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ వ్యక్తిని కాలితో తన్నిన పోలీసు.. నదిలో పడ్డ యువకుడు

సోషల్ మీడియా వేదికగా మరో పోలీసుల క్రౌర్యం వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన వ్యక్తిని చూసేందుకు నది ఒడ్డున నిలబడ్డ ఓ వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాలితో తన్నడంతో గట్టుపై నుంచి నదిలో పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓ వ్యక్తిని కాలితో తన్నిన పోలీసు.. నదిలో పడ్డ యువకుడు
Balaraju Goud
| Edited By: |

Updated on: Jul 30, 2020 | 9:32 AM

Share

సోషల్ మీడియా వేదికగా మరో పోలీసుల క్రౌర్యం వెలుగులోకి వచ్చింది. ప్రమాదవశాత్తు నదిలో పడిపోయిన వ్యక్తిని చూసేందుకు నది ఒడ్డున నిలబడ్డ ఓ వ్యక్తిని ఓ పోలీసు అధికారి కాలితో తన్నడంతో గట్టుపై నుంచి నదిలో పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాపూర్ వింధ్యాచల్ లో జరిగింది.

మీర్జాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వింధ్యచల్ దివాన్ ఘాట్ లోని గంగా నది ఒడ్డు నుంచి ఒక యువకుడు ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోవడంతో జనం గుమిగూడారు. యువకుడి మృతదేహం కోసం గజఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఆపరేషన్ ను ఎస్ హెచ్ వో శశిధర్ పాండే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఆ ప్రాంతంలో సామాజిక దూరాన్ని పాటించకుండా జనం భారీగా గుమిగుడారు. దీంతో అగ్రహించిన పాండే ఓ వ్యక్తిని కాలి తన్నడంతో గంగా నదిలో పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు సదరు పోలీసు అధికారిపై దుమ్మెత్తిపోశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి పాండే నుంచి వ్యక్తిగత సంజాయిషి కోరుతూ నోటీసు జారీ చేశారు. జరిగిన ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించామని మీర్జాపూర్ పోలీసు సూపరింటెండెంట్ ధర్వీర్ సింగ్ తెలిపారు. ఈ విషయంపై విచారణ జరపాలని డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌ను కోరామని.. ఎస్‌హెచ్‌ఓకు వ్యక్తిగతం నోటీసు కూడా జారీ చేశామని ఎస్పీ తెలిపారు.

మరోవైపు, మీర్జాపూర్ పోలీసు అధికారి పాండే తప్పులేదని, జనాన్ని అక్కడి నుంచి తరలించే క్రమంలో కాలు తగిలిందని వివరణ ఇచ్చుకున్నారు.

Follow Us
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
చిన్నప్పుడు రామ్ చరణ్‌ను స్కూల్ నుంచి నేనే తీసుకొచ్చేవాడిని..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
భారతదేశంలో వెల్‌నెస్ టూరిజానికి రిషికేశ్‌ కొత్త చిరునామా..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
వార్నీ ఇన్నాళ్లు ఇంత లైట్ తీసుకున్నామా.. సోంపు నీళ్లు తాగితే..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
టాక్సిక్ సినిమాతో హిట్టు.. అట్టర్ ప్లాప్ మిస్..
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
ఐఫోన్ మోజు.. కుమారుడితో పాటు తల్లిదండ్రి మృతి!
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
రెస్టారెంట్‌లో శాండ్‌విచ్‌ తింటున్న కస్టమర్‌..సగం తిన్నాక అందులో
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..
శ్రావణ మాసంలో రోడ్డుపై డబ్బు దొరికితే శుభమా? లక్ష్మీదేవి..
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..!
ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో
ఈశ్వర్ సాయి-మాధురి రాథోడ్‌ల వ్యవహారంపై హైపర్ ఆది వీడియో