కరోనా టీకాపై డోనాల్డ్ ట్రంప్ క్లారిటీ

అత్యధిక కేసులతో సతమతమవుతున్న అమెరికా, కొవిడ్ వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. టీకా తయారీలో ముందు వరుసలో ఉన్న యూఎస్ అన్ని దేశాలకు వ్యాక్సిన్ ను అందిస్తామని ఆ దేశాధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

కరోనా టీకాపై డోనాల్డ్ ట్రంప్ క్లారిటీ
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 30, 2020 | 5:14 AM

కరోనాతో ప్రపంచదేశాలు అతలాకుతం అవుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. టీకా తయారీలో వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అత్యధిక కేసులతో సతమతమవుతున్న అమెరికా, కొవిడ్ వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. టీకా తయారీలో ముందు వరుసలో ఉన్న యూఎస్ అన్ని దేశాలకు వ్యాక్సిన్ ను అందిస్తామని ఆ దేశాధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ నిరోధానికి సిద్ధం చేస్తున్న టీకాలను అమెరికా ఇతర దేశాలకు సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచనప్రాయంగా తెలిపారు. టీకా తయారైన తరువాత దేశవ్యాప్తంగా వేగంగా టీకా ఉత్పత్తి చేపడతామన్నారు. కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్లు సరఫరా చేసినట్లే టీకాను కూడా ఇతర దేశాలకు అందిస్తామని మంగళవారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది చివరి నాటికల్లా.. వచ్చే ఏడాది మొదట్లోగానీ టీకా అందుబాటులోకి రాచవ్చనని ట్రంప్‌ ప్రభుత్వం అంచనా వేస్తోంది.