AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? ప్రసిద్ధ పీడియాట్రీషియన్ చెబుతున్న ముఖ్యమైన నిజాలు!

చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో రాత్రి పూట నిద్రలో పక్క తడపడం (Bedwetting) అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్య. దీనివల్ల పరుపులు పాడైపోవడమే కాకుండా, ఉదయాన్నే తల్లిదండ్రులు పిల్లలపై కోపం, విసుక్కోవడం చేస్తుంటారు. కొన్నిసార్లు పిల్లలు కూడా ఈ విషయమై తీవ్రమైన సిగ్గుకు, ఆందోళనకు గురవుతారు. అయితే, పిల్లలు ఇలా పక్క తడపడం ఏ వయసు వరకు సాధారణం? ఏ వయసు దాటితే వైద్యులను సంప్రదించాలి? అనే విషయాలపై ప్రముఖ పీడియాట్రీషియన్ డాక్టర్ రవి మాలిక్ సోషల్ మీడియా వేదికగా తల్లిదండ్రులకు కొన్ని అమూల్యమైన సూచనలు చేశారు.

పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? ప్రసిద్ధ పీడియాట్రీషియన్ చెబుతున్న ముఖ్యమైన నిజాలు!
Bedwetting In ChildrenImage Credit source: freepik
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2026 | 6:12 PM

Share

పిల్లలు తరచుగా పక్క తడుపుతుంటారు.. పక్క తడపడం అంటే పిల్లలు రాత్రిపూట అప్రయత్నంగా మూత్ర విసర్జన చేయడం. దీని కారణంగా, పిల్లలు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులు వారిని కఠినంగా తిడుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో, పిల్లలు ఏ వయస్సు వరకు పక్క తడపడం సాధారణమో, ఏ వయస్సులో తల్లిదండ్రులు వైద్యుడి సలహా తీసుకోవడం అవసరమో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల ప్యాట్రిషియన్ డాక్టర్ రవి మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంటూ, ఏ వయస్సు వరకు పిల్లలు పక్క తడపడం వారి జీవసంబంధమైన సమస్య కారణంగా ఉంటుందో తెలియజేశారు.

5 ఏళ్ల లోపు వయసు ఉంటే పూర్తిగా నార్మల్:

డాక్టర్ రవి మాలిక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకవేళ మీ పిల్లల వయసు 5 సంవత్సరాల కంటే తక్కువగా ఉండి, వారు రాత్రి పూట పక్క తడుపుతుంటే అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ వయసులో పిల్లల నరాల వ్యవస్థ (Nervous system) పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. ఫలితంగా, నిద్రలో ఉన్నప్పుడు మూత్రాశయాన్ని (Bladder) నియంత్రించే సామర్థ్యం వారి మెదడుకు వెంటనే అందదు. ఇది పూర్తిగా జీవసంబంధమైన (Biological) ప్రక్రియే తప్ప పిల్లల ప్రవర్తన లోపం కాదు. సాధారణంగా 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారి శరీరంలో నియంత్రణ పెరిగి, ఈ అలవాటు దానంతట అదే తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

భయం వల్ల పక్క తడుపుతారా?:

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి పూట ఏదైనా భయంకరమైన సినిమా చూడటం వల్లో లేదా దెయ్యాల కథలు వినడం వల్లో భయపడి పక్క తడుపుతున్నారని భావిస్తారు. కానీ, ఇందులో నిజం లేదని డాక్టర్ స్పష్టం చేశారు. భయానికి, పక్క తడపడానికి ఎటువంటి సంబంధం లేదు. దీనికి ఏకైక కారణం కేవలం వారి నరాల వ్యవస్థ ఇంకా పూర్తిగా పరిపక్వం చెందకపోవడమే.

వీడియో ఇక్కడ చూడండి..

తల్లిదండ్రులు ఏం చేయాలి?:

5 ఏళ్ల లోపు పిల్లలు పక్క తడిపినప్పుడు వారిని అస్సలు తిట్టకూడదు లేదా శిక్షించకూడదు. అలా చేయడం వల్ల వారిలో మానసిక ఒత్తిడి పెరిగి సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ఓపికగా ఉండాలి. అయితే, మీ పిల్లల వయసు 6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా వారంలో కొన్ని రోజులు నిరంతరాయంగా పక్క తడుపుతుంటే మాత్రం ఖచ్చితంగా పీడియాట్రీషియన్‌ను సంప్రదించాలి. వైద్యులు కొన్ని సాధారణ, సమర్థవంతమైన పద్ధతులు, చిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా దూరం చేస్తారని డాక్టర్ రవి మాలిక్ సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
100 ఏళ్ల చరిత్ర కలిగిన అమ్మమ్మల కాలం నాటి సంప్రదాయ దప్పలం!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!
పిల్లలు పక్క తడపడం ఏ వయసు వరకు నార్మల్? వైద్యులు చెప్పిన నిజాలు!
వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?
వర్షాలు కురవాలని శివుడికి జల దిగ్బంధం.. వీడియో చూశారా..?
బిగ్ బాస్‌ 10 అగ్నిపరీక్షకు ఆడిషన్ వీడియో పంపలేదా? మరో ఛాన్స్..
బిగ్ బాస్‌ 10 అగ్నిపరీక్షకు ఆడిషన్ వీడియో పంపలేదా? మరో ఛాన్స్..
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
పచ్చిమిర్చి మొక్కలను పెంచే సరైన పద్ధతి.. పూత రాలిపోకుండా దిగుబడి
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అగ్నికీలల్లో చిక్కుకున్న విద్యార్థులు.. 12 మంది మృతి!
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అయ్యో ఎంత కష్టం వచ్చే.. బాధలు మోసుకొస్తున్న జూలై.. ఈ రాశుల వారికి
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
అసలే ఓటమి.. ఆపై జరిమానాతోపాటు WTCలోనూ కోత పెట్టిన ఐసీసీ
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
పనులు పూర్తి అవ్వడం లేదా? చివరి వరకు వచ్చి ఆగిపోతున్నాయా?
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
ఈ కుక్క చూపులు చూస్తే కన్నీళ్లు ఆగవు..!