అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్..

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి.

అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్..
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 07, 2020 | 12:30 PM

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అటు కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుంది. అటు సెప్టెంబర్ 21 నుంచి 9-12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. (Unlock4.0 Guidelines In Andhra Pradesh)

  • సెప్టెంబర్ 21 నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు అనుమతి.
  • ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి.
  • సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మతపరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి.
  • సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి, అంతక్రియలకు 20 మందికి అనుమతి
  • సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు అనుమతి నిరాకరణ
  • ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.

Also Read: సెప్టెంబర్ 12 నుంచి తెలుగు రాష్ట్రాల్లో నడిచే స్పెషల్ ట్రైన్స్ ఇవే..

COVID AP GUIDE LINES