అన్‌లాక్‌ 4.0: రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ విధించకూడదు.

దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే మూడు దశల్లో పలు సర్వీసులకు అనుమతించిన కేంద్రం.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్‌లాక్‌ 4.0కు సన్నద్ధం అవుతోంది.

అన్‌లాక్‌ 4.0: రాష్ట్రాలు సొంతంగా లాక్ డౌన్ విధించకూడదు.
Follow us

|

Updated on: Aug 30, 2020 | 1:05 AM

Unlock 4.0 Guidelines: దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. ఇప్పటికే మూడు దశల్లో పలు సర్వీసులకు అనుమతించిన కేంద్రం.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్‌లాక్‌ 4.0కు సన్నద్ధం అవుతోంది. రోడ్లపైకి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కఠినం చేస్తూ.. ప్రతీ ఒక్కరూ కూడా ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబర్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసిన కేంద్రం.. ఆ జోన్ల వెలుపల మాత్రం మరిన్ని సడలింపులు ఇచ్చింది.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0లో రాష్ట్రాలకు క్లియర్ కట్ సూచన ఇచ్చింది. తమ అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా, నగర అధికారులు లాక్ డౌన్ విధించడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని వెల్లడించింది.

Also Read: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..