AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. “ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్”

అగర్బత్తీల ఉత్పత్తిలో భారతీయులు స్వయం సమృద్ధి సాధించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కల్పనకు దోహదపడేలా ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక కార్యక్రమానికి ఎంఎస్ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.

కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్
Balaraju Goud
|

Updated on: Aug 02, 2020 | 11:33 PM

Share

అగర్బత్తీల ఉత్పత్తిలో భారతీయులు స్వయం సమృద్ధి సాధించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కల్పనకు దోహదపడేలా ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక కార్యక్రమానికి ఎంఎస్ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. “ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్” పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరుద్యోగులు, వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు దేశంలో అగర్బత్తీల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తారు.

ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ ఆధ్వర్యంలో చేపట్టే ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే అగర్బత్తీల పరిశ్రమలో వేలాదిమందికి ఉపాధి లభించనున్నది. ముఖ్యంగా చేతి వృత్తిదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అమలు చేసేందుకు కె వి ఐ సి రూపకల్పన చేసింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడం దీని ప్రత్యేకత. అగర్బత్తీల ఉత్పత్తిదారులను వ్యాపార భాగస్వాములుగా చేర్చుకొని ఉప్పత్తి సామర్థ్యం పెంచాలని కె వి ఐ సి నిర్ణయించింది. అగర్బత్తీలను తయారు చేసేందుకు అవసరమైన ఆటోమేటిక్ యంత్రాలను, పొడిని కలిపే యంత్రాలను ఈ స్కీము ద్వారా ప్రభుత్వమే అందిచనుంది. ఇందుకోసం స్థానికంగా భారతీయ ఉత్పత్తిదారులు తయారుచేసిన యంత్రాలనే సేకరించాలని కె వి ఐ సి నిర్ణయించింది. తద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు ఆర్థిక స్వలంభన సాధించవచ్చన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు