AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ring In Garbage: చేజారిపోయిందనుకున్న వెడ్డింగ్ రింగ్.. మళ్లీ చేతికొచ్చింది.. ప్రేమకున్న పవర్ ఇదేనేమో.!

UK Man Drops Ring In Garbage: ప్రేమికుల రోజున ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇక వాటికి చాలా ఇంపార్ట్‌నెస్స్‌ ఇస్తుంటారు...

Ring In Garbage: చేజారిపోయిందనుకున్న వెడ్డింగ్ రింగ్.. మళ్లీ చేతికొచ్చింది.. ప్రేమకున్న పవర్ ఇదేనేమో.!
Ravi Kiran
|

Updated on: Feb 22, 2021 | 2:16 PM

Share

UK Man Drops Ring In Garbage: ప్రేమికుల రోజున ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇక వాటికి చాలా ఇంపార్ట్‌నెస్స్‌ ఇస్తుంటారు. అదే వాలంటైన్స్ డే రోజున వెడ్డింగ్‌ చేసుకుని.. రింగ్‌లు మార్చుకుంటే అది మరింత ప్రత్యేకం. ఆ రింగ్‌లను ఎంతో ముఖ్యంగా భావిస్తారు. ఇంత ఇంపార్ట్‌టెన్స్‌ ఇచ్చే.. రింగ్‌ సడెన్‌గా కనిపించకుండాపోతే.. ఇంకేమైనా ఉందా..? గుండెజారిపోయినంతా పని అవుతుంది. అయితే ఇలాంటి సమస్యనే ఎదురుకుంటున్న ఓ వ్యక్తికి.. ఓ లేడీ పోలీస్‌ చేసిన హెల్ప్‌తో పోయిన రింగ్‌ మళ్లీ దొరికింది. ఇంతకీ ఆమె చేసిన హెల్ప్‌ ఏంటో మీరే చదవండి.

బ్రిటన్‌కు చెందిన జేమ్స్‌ రాస్‌ అనే వ్యక్తి.. ఈ నెల 14న తన ప్రేయసిని పెళ్లి చేసుకుని.. ఒకరికి రింగులు మార్చుకున్నారు. అదే రోజు రాత్రి.. ఇంట్లోని చెత్తపారేసే బుట్టలో అతని వెడ్డింగ్ రింగ్ జారి పడింది. అందులో 10 అడుగుల ఎత్తువరకూ చెత్త ఉంది. ఉంగరం పడిపోయిన విషయం అతనికి తెలియలేదు. యధాలాపంగా ఆ చెత్తను పారిశుధ్య సిబ్బందికి ఇవ్వడం.. వారు దాన్ని వేస్ట్ రీసైక్లింగ్ సెంటర్‌కు తీసుకెళ్లడం జరిగిపోయాయి.

రింగ్‌ పోయిన విషయం లేటుగా తెలుసుకున్న జేమ్స్‌కు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. తన లైఫ్‌‌లో ఎంతో మెమరబుల్‌గా ఉంచుకుందాం అనుకున్న రింగ్‌ కనిపించకుండాపోవడంతో బాధపడ్డాడు. ఇక తన ఇంటికి సమీపంలోనే.. కార్ల తనిఖీలు చేస్తున్న ఓ లేడీ పోలీస్‌కు.. తన గోడును వెల్లబుచ్చుకున్నాడు. జేమ్స్‌ బాధను ప్రశాంతంగా విన్న పోలీస్‌.. ఆ రింగ్ వెతకమని పారిశుధ్య సిబ్బందికి తెలిపగా… వారు 20 నిమిషాలు ఆ రింగ్‌ను వెతికి కనిపెట్టారు. పోయిందనుకున్న రింగ్‌ను చూసి.. జేమ్స్‌ భావోద్వేగానికి గురయ్యాడు.

Also Read: రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!