పుల్వామాలో ఎన్​కౌంటర్​, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో సైనికులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

పుల్వామాలో ఎన్​కౌంటర్​, ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2020 | 10:33 PM

జమ్మూ కాశ్మీర్ పుల్వామాలో సైనికులు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పుల్వామా జిల్లా అవంతిపొరాలోని సంబూరా ఏరియాలో.. టెర్రరిస్టులు నక్కిఉన్నారనే పక్కా సమాచారంతో భారత భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ముందే పసిగట్టిన ముష్కరులు .. సైన్యంపై కాల్పులు జరిపారు. దీటుగా తిప్పికొట్టిన సిబ్బంది ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. వీరు ఏ ముఠాకు చెందినవారో తెలియాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read :

ఎస్పీబీ ఆస్పత్రి బిల్లులపై తప్పుడు ప్రచారం, చరణ్ ఆవేదన

ప్రభాస్ క్రేజీ రికార్డ్.. తొలి సౌత్ హీరోగా అరుదైన ఘనత