మీడియా చరిత్రలో సంచలనం, గలీజ్ డ్రగ్స్‌పై టీవీ9 ఎక్స్‌ప్లోజివ్ స్టోరీ
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో తెర వెనుక డ్రగ్ కథా చిత్రమ్‌దేశాన్ని కుదిపేసింది. డ్రగ్ మూలాలపై ఎన్‌సిబి లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త కొత్త లింకులు బయటపడుతూనే ఉన్నాయి.
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో తెర వెనుక డ్రగ్ కథా చిత్రమ్‌దేశాన్ని కుదిపేసింది. డ్రగ్ మూలాలపై ఎన్‌సిబి లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొత్త కొత్త లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఈక్రమంలో హైదరాబాద్‌లోనూ ఇంకా డ్రగ్ జాడలున్నాయా? హైదరాబాద్ నుంచి డ్రగ్స్ కోసం ఎవరు ఎటు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి ..ఎలా డ్రగ్స్ తెస్తున్నారు?..ఈ అంశంపై టీవీ9 నిఘా నేత్రం ఫోకస్ చేసింది. ఆపరేషన్ చార్లిలో బయటపడిన సంచలన వాస్తవాలను మీముందుకు తెచ్చింది. డ్రగ్ రాకెట్‌లో ఇంకెవరెవరి పేర్లున్నాయో ఎన్‌సిబి ఇసాబ్‌లో తేలుద్ది. కానీ అంతకన్నా ముందు దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న డ్రగ్ మూలస్థావరాలను..అడ్డూ అదుపులేని డ్రగ్ రహదారిని టీవీ9 మీ కళ్ల ముందుకు తెచ్చింది. అలాగే డ్రగ్ అక్రమ రవాణాకు అడ్డేలేదన్న నిజాన్ని కూడా. మీడియా చరిత్రలోనే నెవర్ బిఫోర్ ఎక్స్‌ప్లోజివ్ స్టోరీతో టీవీ9 మీ ముందుకు వచ్చింది.
గోవాకు పర్యాటకుల రద్దీ మాములుగా ఉండదు. ఇటీవల కొత్త లెక్క తెరపైకి వచ్చిందక్కడ. టూరిస్టుల్లో 75 శాతం మంది తెలుగువాళ్లు..అందులో హైదరాబాదీలే ఎక్కువ. గోవా టూరుకు క్రేజ్ పెరగడం వెనక అసలు లెక్కేంటి? డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతన్న క్రమంలో..గోవా రష్ వెనుక కూడా ఆ లింకులున్నాయా?..ఆరా తీసేందుకు టీవీ9 టీమ్ గోవాలో అడుగుపెట్టారు. గంటా రెండు గంటల్లో డ్రగ్స్ చేతికందాయి. ఐతే డ్రగ్స్ దొరకడం ఎంత ఈజీనో డ్రగ్స్‌ను బట్వాడా చేయడం కూడా అంత ఈజీనే టీవీ 9 నిఘాలో తేలింది?..క్రాస్ చెకింగ్‌లో భాగంగా టీవీ9 టీమ్ రిటర్న్ జర్నీ మొదలైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండానే 4 రాష్ట్రాలు 19 చెక్‌పోస్టులు దాటి డ్రగ్స్‌ను హైదరాబాద్ తీసుకువచ్చింది.