AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 హిందీ ఛానల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రాంతీయ ఛానల్‌గా ప్రారంభమై జర్నలిజం అంటే సమాజ సేవ: రవి ప్రకాశ్ ‘భారత్ వర్ష్’ నంబర్ వన్‌గా నిలుస్తుంది న్యూఢిల్లీః ‘భారత్ వర్ష్’ పేరుతో జాతీయ స్థాయిలో టీవీ9 సంస్థ నుంచి హిందీ న్యూస్ ఛానల్‌ ప్రారంభమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖ జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ టీవీ9 టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.  ప్రాంతీయ […]

టీవీ9 హిందీ ఛానల్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
Vijay K
| Edited By: |

Updated on: Apr 01, 2019 | 3:03 PM

Share
  • ప్రాంతీయ ఛానల్‌గా ప్రారంభమై
  • జర్నలిజం అంటే సమాజ సేవ: రవి ప్రకాశ్
  • ‘భారత్ వర్ష్’ నంబర్ వన్‌గా నిలుస్తుంది

న్యూఢిల్లీః ‘భారత్ వర్ష్’ పేరుతో జాతీయ స్థాయిలో టీవీ9 సంస్థ నుంచి హిందీ న్యూస్ ఛానల్‌ ప్రారంభమైంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని మోడీ చేతుల మీదగా ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి పలువురు ప్రముఖ జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ టీవీ9 టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయ ఛానల్‌గా ప్రారంభమై

2003లో తెలుగులో ఒక ప్రాంతీయ ఛానల్‌గా టీవీ9 సంస్థ ప్రారంభమై తర్వాత క్రమంగా ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఛానళ్లను ప్రారంభిస్తూ దిగ్విజయంగా ముందుకు సాగింది. అనేక భాషల తర్వాత హిందీ భాషలో, హిందీ జర్నలిజంలో టీవీ9 అడుగు పెట్టింది.

జర్నలిజం అంటే సమాజ సేవః రవిప్రకాశ్

ఈ సందర్భంగా టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమ కోసం సమయం కుదుర్చుకున్న ప్రధాని మోడీ గారికి కృతజ్ఞతలు అని చెప్పారు. గుజరాత్‌లో ఒక ప్రాంతీయ నాయకులుగా మొదలై నేడు దేశ ప్రధానిగా మోడీ ఎదిగిన తీరు తమకు ఆదర్శం అని అన్నారు. జర్నలిజం అంటే సమాజ సేవ అని, 15 ఏళ్ల క్రితం కొంతమంది యువ జర్నలిస్టులతో టీవీ9 ప్రారంభమైందని ఆయన చెప్పారు.

ప్రజా సమస్యల వైపుగా ప్రభుత్వాలను అడుగులు వేయించే దిశగా, ఒత్తిడి తీసుకొచ్చే దిశగా టీవీ9 అడుగులు వేస్తూ వచ్చిందని అన్నారు. ‘దేశ్ బద్లో’ అనే నినాదంతో దేశాన్ని మార్చాలి, దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని టీవీ9 భావిస్తోంది. ఆ క్రమంలో ఈ హిందీ ఛానల్ ఒక ప్రధాన అడుగుగా టీవీ9 భావిస్తుందని రవి ప్రకాశ్ తెలిపారు.

‘భారత్ వర్ష్’ నంబర్ వన్‌గా నిలుస్తుంది

ఈ సందర్భంగా టీవీ9లో కీలక బాధ్యతల్లో ఉన్న పలువురి అభిప్రాయాలను ఇన్‌పుట్ ఎడిటర్ మురళీ కృష్ణ అడిగి తెలుసుకున్నారు. టీవీ9 ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ రజనీకాంత్ మాట్లాడుతూ టీవీ9 నేడు ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం సీఈఓ రవి ప్రకాశ్ అని, ఆయన నాయకత్వంలో, ఆయన స్ఫూర్తితోనే తామందరం పని చేస్తున్నామని అన్నారు. టీవీ9 మరో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ వి. చంద్రమౌళి మాట్లాడుతూ మెరుగైన సమాజం నినాదంతో చిన్నగా ప్రారంభమైన టీవీ9 ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగిందని చెప్పారు. భారత్ వర్ష్ కూడా నంబర్ వన్‌గా నిలిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మరో ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్ ఎం. చంద్రమౌళి మాట్లాడుతూ టీవీ9 చిన్న పాయలా ప్రారంభమై ఇప్పుడు మహానదిలా మారిందని, తమకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. టీవీ9 సీఎఫ్ఓ మూర్తి మాట్లాడుతూ ప్రాంతీయ ఛానళ్లలో మంచి పేరును టీవీ9 సాధించిందని, ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు సాధిస్తుందని తాను భావిస్తున్నట్టు తెలిపారు.

లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..