AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యుడి సమస్యల పరిష్కారం కోసమే టీవీ9 : సీఈవో రవిప్రకాశ్

న్యూఢిల్లీ : టీవీ9 భారత్‌వర్ష్ ఛానల్ ప్రారంభ వేడుక దేశ రాజధాని ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్యుడి సమస్యల పరిష్కారానికి 15ఏళ్లుగా పనిచేస్తున్న టీవీ9.. నేటి నుంచి ‘టీవీ9 భారత్‌వర్ష్’ పేరుతో జాతీయ ఛానెల్‌గా ముందుకొచ్చిందన్నారు సీఈవో రవిప్రకాష్. ఇప్పటికే తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషాల్లో ఆదరణ పొందినట్లుగానే.. హిందీలో కూడా తమ ఛానల్ ప్రజల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు రవిప్రకాష్. సమాజానికి సేవ […]

సామాన్యుడి సమస్యల పరిష్కారం కోసమే టీవీ9 : సీఈవో రవిప్రకాశ్
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 01, 2019 | 3:22 PM

Share

న్యూఢిల్లీ : టీవీ9 భారత్‌వర్ష్ ఛానల్ ప్రారంభ వేడుక దేశ రాజధాని ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్యుడి సమస్యల పరిష్కారానికి 15ఏళ్లుగా పనిచేస్తున్న టీవీ9.. నేటి నుంచి ‘టీవీ9 భారత్‌వర్ష్’ పేరుతో జాతీయ ఛానెల్‌గా ముందుకొచ్చిందన్నారు సీఈవో రవిప్రకాష్. ఇప్పటికే తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషాల్లో ఆదరణ పొందినట్లుగానే.. హిందీలో కూడా తమ ఛానల్ ప్రజల ఆదరణ పొందుతుందని ఆకాంక్షించారు రవిప్రకాష్. సమాజానికి సేవ చెయ్యాలనే కొద్ది మంది యువ జర్నలిస్టులతో ప్రారంభమైన టీవీ9.. ఈ రోజు విస్తృతంగా.. విభిన్న ప్రాంతాలకు చేరువ కావడానికి ప్రజల ఆదరణే కారణమని అన్నారు. టీవీ9 భారత్ వర్ష్ ద్వారా అధిక సంఖ్యలో ప్రజలకు సేవలందించే అవకాశం లభించిందని అన్నారు. మున్ముందు కూడా సమాజహితానికి టీవీ9 మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. టీవీ9 సంస్థను ఇంత విజయపథంలో ముందుకు తీసుకెళ్లడానికి కారణమైన ప్రతి ఉద్యోగికి సీఈవో రవిప్రకాష్ ధన్యవాదాలు తెలిపారు.

Follow Us