నదీ స్నానాలకు బదులుగా జల్లు సాన్నాలు… నవంబరు 20 తేదీ మద్యాహ్నం 1.21 నిముషాలకు తుంగభద్ర పుష్కరాలు..

2008లో జరిగిన ఈ పుష్కరాలు మళ్లీ ఈ ఏడాదీలో జరగనున్నాయి. తుంగభద్ర పుష్కారాలకు మూహార్తం కూడా వచ్చేసింది. తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు నోటిఫికేషన్‌ను దేవాదాయశాఖ జారీ చేసింది.

నదీ స్నానాలకు బదులుగా జల్లు సాన్నాలు... నవంబరు 20 తేదీ మద్యాహ్నం 1.21 నిముషాలకు తుంగభద్ర పుష్కరాలు..
Follow us

|

Updated on: Nov 18, 2020 | 6:51 PM

Tungabhadra Pushkars : తుంగభద్రలో పుష్కర సందడి మొదలు కాబోతోంది. 2008లో జరిగిన ఈ పుష్కరాలు మళ్లీ ఈ ఏడాదీలో జరగనున్నాయి. తుంగభద్ర పుష్కారాలకు మూహార్తం కూడా వచ్చేసింది. తుంగభద్ర పుష్కరాల నిర్వహణకు నోటిఫికేషన్‌ను దేవాదాయశాఖ జారీ చేసింది. నవంబరు 20 తేదీ మద్యాహ్నం 1.21 నిముషాల నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్ లో పేర్కోంది.

12 రోజుల పాటు పుష్కరాలను నిర్వహించనున్నట్టు ఉత్తర్వుల్లో దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజా శంకర్ పేర్కోన్నారు. నవంబరు 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ 12 రోజుల పాటు పుష్కరాల నిర్వహణ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబరు 11 తేదీన జరిగిన దైవజ్ఞ సమ్మేళనంలో తుంగభద్రా నదీ పుష్కరాల ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు వెల్లడించారు.

తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది.

ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. ఇప్పటికే ఆయా జిల్లాల అధికారులతో స్పెషల్ కమీషనర్ అర్జునరావు వీడియోకాన్పరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. కోవిడ్ వ్యాప్తిచెందకుండా మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతూ.. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.