వాళ్లు మోసగాళ్లే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మంత్రి పదవి వచ్చినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. సమయం వచ్చినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా వ్యాపారులు మోసగాళ్లు అంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. కొంతమంది విద్యా పేరుతో తెలంగాణ విద్యార్ధులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి విద్య అందిస్తామని, తెలంగాణ విద్యార్ధులు వారి మాయలో పడొద్దని హితవు పలికారు. ఆంధ్రాకు చెందిన కొంతమంది విద్యను […]

వాళ్లు మోసగాళ్లే.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Sep 30, 2019 | 5:53 PM

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి మంత్రి పదవి వచ్చినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. సమయం వచ్చినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా వ్యాపారులు మోసగాళ్లు అంటూ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. కొంతమంది విద్యా పేరుతో తెలంగాణ విద్యార్ధులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి విద్య అందిస్తామని, తెలంగాణ విద్యార్ధులు వారి మాయలో పడొద్దని హితవు పలికారు. ఆంధ్రాకు చెందిన కొంతమంది విద్యను వ్యాపారం చేసి, విద్యార్ధులను, వారి తల్లిదండ్రులకు మోసం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి శ్రీనివాసగౌడ్.

గతంలో టీఎఎన్జీవో నేతగా ఉన్న కాలంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు శ్రీనివాస గౌడ్. ఆంధ్రాకు చెందిన ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగడం సరికాదని, ఇంకా ఇక్కడ మీరు ఎందుకు ఉన్నారంటూ వివాదాన్ని రాజేశారు. ఆంధ్రా ఉద్యోగులు తమ సొంతరాష్ట్రానికి వెళ్లిపోవాలని, తెలంగాణకు చెందిన వారు ఎవరూ ఆంధ్రాలో ఉద్యోగాలు చేయాలని కోరుకోనప్పుడు మీరు మాత్రం ఇక్కడ ఎందుకు ఉంటారంటూ దుమారం లేపారు.

అదే విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకు, వితంంతువులు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ పెంచిన సందర్భంగా వాటి ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చిన తమ పార్టీని మర్చిపోతే అలాంటి వారికి పుట్టగతులు ఉండవంటూ వ్యాఖ్యానించారు. ఈ విధంగా అవకాశం చిక్కినప్పుడల్లా వివాదాస్పద వ్యాఖ్యలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు మంత్రి శ్రీనివాసగౌడ్. తాజాగా ఆయన “ఆంధ్రా వ్యాపారులు మోసగాళ్లు” అంటూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు