రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో మరో మైలురాయి.. ఇమ్యునో థెరపీ

రొమ్ము క్యాన్సర్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు ప్రధానంగా కీమో థెరపీ ఇచ్చి బాధితులకు ఉపశమనాన్ని కల్గిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట క్యాన్సర్ అనేది మరింత ప్రమాదకరమైందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంంచి రక్షించుకోడానికి కీమో థెరపీతో పాటు ఇమ్యునో థెరపీతో చికిత్స చేయడం వల్ల క్యాన్సర్ మళ్లీ […]

రొమ్ము క్యాన్సర్‌ చికిత్సలో మరో మైలురాయి.. ఇమ్యునో థెరపీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 30, 2019 | 5:13 PM

రొమ్ము క్యాన్సర్‌ ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు ప్రధానంగా కీమో థెరపీ ఇచ్చి బాధితులకు ఉపశమనాన్ని కల్గిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట క్యాన్సర్ అనేది మరింత ప్రమాదకరమైందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంంచి రక్షించుకోడానికి కీమో థెరపీతో పాటు ఇమ్యునో థెరపీతో చికిత్స చేయడం వల్ల క్యాన్సర్ మళ్లీ పునరావృతమయ్యే అవకాశాలు లేవని ఒక పరిశోధనలో వెల్లడైంది.

ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సాధారణ రొమ్ము క్యాన్సర్ కంటే ప్రమాదకరమైందిగా పరిశోధకులు గుర్తించారు. ఈ క్యాన్సర్ కణితి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్లతో పాటు హెర్2 అనే ప్రోటీన్‌లను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు రొమ్ము క్యాన్సర్ చికిత్స విధానంలో క్యాన్సర్ సోకిన రొమ్ము భాగాన్ని తొలగించడం, కీమో థెరపీతో చికిత్స అందించడం చేస్తున్నారు.

స్పెయిన్‌లో బార్సిలోనాలో జరుగుతున్న ఈఎస్ఎంఓ 2019 కాంగ్రెస్‌లో ప్రపంచాన్ని వణికిస్తున్న రొమ్ము క్యాన్సర్, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి పరిశోధన పత్రాలను సమర్పించారు. ఇప్పటివరకు చేస్తున్న చికిత్సకు భిన్నంగా ఇమ్యునో థెరపీని కలిపి చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధించినట్టు వారి పరిశోధనలో వెల్లడైనట్టు తెలిపారు.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధానమే ఇమ్యునో థెరపీ. ట్రిపుల్ నెగటివ్ రొమ్ము క్యాన్సర్ రోగులకు దీన్ని అందిస్తూనే.. కీమో థెరపీ చికిత్స చేస్తూ బాధిత మహిళల్లో కలిగిన మార్పులను గమనించారు. దాదాపు 21 దేశాల్లో 1,174 మంది మహిళలపై దీన్ని ప్రయోగించి సక్సెస్ సాధించారు. పరిశోధనలో ఇమ్యునో థెరపీతో కీమో థెరపీ ప్రయోగించబడిన 64.8 శాతం మంది బాధిత మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ కారక కణజాలం కనిపించలేదని తేలింది. బార్సిలోనాలో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌లో లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీ, సెయింట్ బార్త్‌లోమేవ్ హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ పీటర్ షిడ్మ్ మాట్లాడుతూ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌ ప్రాణాలను హరించే శక్తి కలిగిన వ్యాధిగా పేర్కొన్నారు. తమ పరిశోధనలో కీమో థెరపీతో పాటు ఇమ్యునో థెరపీని జోడించడం వల్ల బాధిత మహిళల్లో అనూహ్య మర్పులు వచ్చాయన్నారు. తమ పరిశోధన విజయవంతం కావడానికి మరింత సమయం పడుతుందని.. ఈ ప్రయత్నం ఫలిస్తే రొమ్ము క్యాన్సర్ మరణాలను తగ్గించగలిగినట్టే అంటూ షిడ్మ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో ప్రధానంగా కీమో థెరపీ చేసినప్పటికీ ఆ వ్యాధి కొద్ది కాలం తర్వాత మళ్లీ వచ్చే అవకాశాలున్నాయని, తమ పరిశోధనలో తాము ఇమ్యునో థెరపీ ఇవ్వడం ద్వారా కేన్సర్ కణాల సంఖ్యను బాగా తగ్గించగలిగామని ఆయన తెలిపారు.