హద్దుమీరిన ఇమ్రాన్.. భారత్‌పై “జిహాద్” చేస్తున్నామంటూ వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన సహచర మంత్రులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి హద్దులు మీరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై జిహాద్ చేస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన ముగించుకొని ఆదివారం పాకిస్థాన్‌కు చేరుకున్న ఇమ్రాన్.. విమానాశ్రయంలో సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ప్రపంచమంతా పట్టించుకోకపోయినా తాము […]
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన సహచర మంత్రులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి హద్దులు మీరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై జిహాద్ చేస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన ముగించుకొని ఆదివారం పాకిస్థాన్‌కు చేరుకున్న ఇమ్రాన్.. విమానాశ్రయంలో సొంత పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. ప్రపంచమంతా పట్టించుకోకపోయినా తాము కశ్మీరీలకు అండగా నిలుస్తామంటూ వ్యాఖ్యానించారు. కశ్మీరీలు జిహాద్(పవిత్ర యుద్ధం) చేస్తున్నారని… వారికి మద్దతు పలకడం కూడా జిహాదే అని అన్నారు. అల్లా మాపట్ల ఆనందంగా ఉండడం కోసమే మేం ఈ పని చేస్తున్నామంటూ సమర్ధించుకున్నారు. కశ్మీరీలు మీ వైపే చూస్తున్నారన్న ఆయన.. పాకిస్థాన్ ప్రజలు అండగా ఉంటే కశ్మీరీలు విజయం సాధిస్తారని అన్నారు.