ప్రతీకార దాడులు.. పదిమంది మిలిటెంట్లు హతం

అగ్రరాజ్యం అమెరికా మిలిటెంట్లపై ప్రతీకార దాడులు చేపట్టింది. సోమాలియాలో ఇటీవల యూరప్ మిలటరీ కాన్వాయ్ టార్గెట్‌గా అల్ షాబాద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అప్పటి నుంచి ఆ ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. అయితే తాజాగా సోమవారం సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ ఉగ్ర సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు హతమయ్యారని అమెరికా మిలటరీ అధికారులు వెల్లడించారు. […]

ప్రతీకార దాడులు.. పదిమంది మిలిటెంట్లు హతం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2019 | 9:03 AM

అగ్రరాజ్యం అమెరికా మిలిటెంట్లపై ప్రతీకార దాడులు చేపట్టింది. సోమాలియాలో ఇటీవల యూరప్ మిలటరీ కాన్వాయ్ టార్గెట్‌గా అల్ షాబాద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే అప్పటి నుంచి ఆ ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించింది. అయితే తాజాగా సోమవారం సోమాలియాలో అల్ షాబాబ్ ఉగ్రవాదులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా వాయుసేన ప్రతి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆ ఉగ్ర సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు హతమయ్యారని అమెరికా మిలటరీ అధికారులు వెల్లడించారు. సోమాలియా దేశ రాజధాని నగరమైన మొగదీషులో గతంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా యూఎస్ ఆఫ్రికా కమాండ్ నుంచి అమెరికా సైనికులు ప్రతి దాడులు చేశారు. ఈ ఘటనలో అల్ షాబాద్ సంస్థకు చెందిన పదిమంది మిలిటెంట్లు మరణించారు.