‘మంచిని మంచిఅని.. చెడును చెడుఅని చూపెట్టండి’ : కేటీఆర్

ఇవాళ తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ జరిపారు. ఈ సందర్భంలో అనేక ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. “ఆర్బీఐ నివేదిక ప్రకారం…భారత దేశంలోనే తెలంగాణ అత్యధికంగా రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం గా నిలిచింది.. ఇప్పటివరకు 27 వేల కోట్ల పై చిలుక రూపాలు రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇది మా ప్రభుత్వ, మా పార్టీకి రైతుల పట్ల ఉన్న కమిట్ మెంట్ కి ఇది నిదర్శనం. రైతు బంధు పేరుతో మరో 28 […]

'మంచిని మంచిఅని.. చెడును చెడుఅని చూపెట్టండి' : కేటీఆర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 28, 2020 | 2:48 PM

ఇవాళ తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ చిట్ చాట్ జరిపారు. ఈ సందర్భంలో అనేక ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. “ఆర్బీఐ నివేదిక ప్రకారం…భారత దేశంలోనే తెలంగాణ అత్యధికంగా రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం గా నిలిచింది.. ఇప్పటివరకు 27 వేల కోట్ల పై చిలుక రూపాలు రుణమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ. ఇది మా ప్రభుత్వ, మా పార్టీకి రైతుల పట్ల ఉన్న కమిట్ మెంట్ కి ఇది నిదర్శనం. రైతు బంధు పేరుతో మరో 28 వేల కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలోకి. ఇప్పటివరకూ మొత్తంగా 56 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది. తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయింది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని మీడియా చూపెట్టే ప్రయత్నం చేయండి. మంచిని మంచి అని చెడు ను చేడు అని చూపెట్టండి. వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. తెలంగాణలో 60 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతు రుణమాఫీ, రైతు బంధు ద్వారా 95 శాతం మంది చిన్న కారు రైతులకు పూర్తి స్థాయిలో లబ్ది చేకూరింది. రాహుల్ గాంధీ 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పిన ప్రజలు నమ్మలేదు. విపక్షాలు ఇప్పుడయినా ఆర్బీఐ రిపోర్ట్ తెలుసుకోవాలి. అంటూ తనదైన శైలిలో మీడియాతో ముచ్చటించారు కేటీఆర్.