మూడేళ్ల చిన్నారిపై అమానుషం.. నిందితుడిని నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు

పశ్చిమగోదావరి జిల్లాలో మానవ మృగం రెచ్చిపోయింది. మద్యం మత్తులో లోకం మరిచి కర్కశంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని ఓ చిన్నారిని అఘాయిత్యానికి యత్నించాడు.

మూడేళ్ల చిన్నారిపై అమానుషం.. నిందితుడిని నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 28, 2020 | 1:52 PM

పశ్చిమగోదావరి జిల్లాలో మానవ మృగం రెచ్చిపోయింది. మద్యం మత్తులో లోకం మరిచి కర్కశంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని ఓ చిన్నారిని అఘాయిత్యానికి యత్నించాడు. మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. ఇది గమనించిన స్థానికులు బాలికను రక్షించి కీచకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తణుకు పట్టణంలో ఈ అమానుషం చోటు చేసుకుంది. పాతూరు ఎనిమిదో వార్డులో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు.

జంగారెడ్డిగూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం మంగళవారం పాతూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఫూటుగా మద్యం తాగి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని తాళ్లతో కట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం కొట్టుకుంటూ నగ్నంగా మున్సిపల్‌ కార్యాలయం వరకు ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.