దీపికా పదుకొణె మేనేజర్ ఇంట్లో పట్టుబడిన డ్రగ్స్
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంటిలో నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విచారణకు...
Deepika Padukone Manager : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్ ఇంటిలో నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు సమన్లు జారీ చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసులో భాగంగా డ్రగ్స్ విషయమై హీరోయిన్ దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌కు మరోసారి సమన్లు జారీ చేసింది . మంగళవారం ఆమె ఇంటిపై సోదాలు నిర్వహించిన ఎన్సీబీ.. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. అయితే ఎంత పరిమాణంలో పట్టుబడ్డాయో స్పష్టత లేదు. కాగా ప్రస్తుతం కరీష్మా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం విచారణకు హాజరుకావల్సిందిగా సమన్లు జారీ చేశారు అధికారులు.
Karishma Prakash (Deepika Padukone’s manager) has been summoned for investigation tomorrow: Sameer Wankhede, Zonal Director, Narcotics Control Bureau, Mumbai pic.twitter.com/P6HuWOwRm8
— ANI (@ANI) October 27, 2020