తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హోం క్వారంటైన్ గడువు పెంపు
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. హోం

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. తెలంగాణాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్ గడువు ప్రస్తుతం 14 రోజులు ఉండగా, దానిని 28 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా.. కేవలం ప్రైమరీ కాంటాక్టులపై కోవిద్-19 టెస్ట్ చేయాలని అధికారులకు సూచించింది. తాజాగా తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరింది. మృతుల సంఖ్య 23కు చేరింది.
కాగా.. సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. జిల్లాలో కేసుల సంఖ్య 80కి చేరింది. నిన్న ఒక్క రోజే అధికారులు 26 కేసులు నిర్ధారించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా భారీగా కేసులు బయటపడుతున్నాయి.



