కృష్ణా జిల్లాలో టెన్ష‌న్..ఆవుల కళ్లలో నుంచి రక్తం..

కరోనాతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న స‌మ‌యంలో కృష్ణా జిల్లాలో టెన్ష‌న్ నెల‌కుంది. అక‌స్మాత్తుగా పదుల సంఖ్యలో ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. వాటి ఒంటిపై ఎర్రటి మచ్చలు… కళ్లలో నుంచి రక్తం కారడం చూసి ప్ర‌జ‌లు షాక్ కు గుర‌య్యారు. సుమారు 70 ఆవుల్లో ఇదే పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్ర‌స్తుతం క‌రోనా విస్త‌రిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని కొండపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు సమాచారంతో పశువైద్యాధికారులు గ్రామానికి చేరుకుని ఆవుల‌కు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ […]

కృష్ణా జిల్లాలో టెన్ష‌న్..ఆవుల కళ్లలో నుంచి రక్తం..
Follow us

|

Updated on: Apr 22, 2020 | 3:16 PM

కరోనాతో స‌త‌మ‌త‌మ‌వుతోన్న స‌మ‌యంలో కృష్ణా జిల్లాలో టెన్ష‌న్ నెల‌కుంది. అక‌స్మాత్తుగా పదుల సంఖ్యలో ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. వాటి ఒంటిపై ఎర్రటి మచ్చలు… కళ్లలో నుంచి రక్తం కారడం చూసి ప్ర‌జ‌లు షాక్ కు గుర‌య్యారు. సుమారు 70 ఆవుల్లో ఇదే పరిస్థితి కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్ర‌స్తుతం క‌రోనా విస్త‌రిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని కొండపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికులు సమాచారంతో పశువైద్యాధికారులు గ్రామానికి చేరుకుని ఆవుల‌కు పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ ద్వారా వాటికి పొంగు వ్యాధి వచ్చిందని నిర్ధారించారు. పొంగు కూడా అంటు వ్యాధ‌ని.. అది ఒక ఆవు నుంచి నుంచి మరో ఆవుకు వ్యాపిస్తుందని.. అలా 70 ఆవులకు సోకిందన్నారు. పొంగు వ్యాధి శరీరం నుంచి కడుపులోకి పాకితే ప్రమాదమని.. వారంరోజుల పాటు త‌ప్ప‌నిస‌రిగా ట్రీట్మెంట్ అందించాలన్నారు. ఆవుల వల్ల కరోనావైరస్ వ్యాప్తి చెందే అవ‌కాశాలు లేవ‌ని వైద్యులు చెప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.