ట్రంప్ ప్ర‌చార తీరు మార‌నుందా ?

ట్రంప్ రాజకీయ చేయ‌ద‌గ్గ ఏ అంశాన్నీ అంత ఈజీగా వ‌దిలిపెట్ట‌రు. అందులో ఇప్పుడు ఎల‌క్ష‌న్ టైమ్. డెమొక్రాట్లు తమ జాతీయ సదస్సును ప్రారంభించడంతో, ట్రంప్ తన ప్రచార షెడ్యూల్‌లో ప్ర‌త్య‌ర్థిపై విమ‌ర్శ‌ల దాడి చేయ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

ట్రంప్ ప్ర‌చార తీరు మార‌నుందా ?
Follow us

|

Updated on: Aug 18, 2020 | 4:35 PM

ట్రంప్ రాజకీయం చేయ‌ద‌గ్గ ఏ అంశాన్నీ అంత ఈజీగా వ‌దిలిపెట్ట‌రు. అందులో ఇప్పుడు ఎల‌క్ష‌న్ టైమ్. డెమొక్రాట్లు తమ జాతీయ సదస్సును ప్రారంభించడంతో, ట్రంప్ తన ప్రచార షెడ్యూల్‌లో ప్ర‌త్య‌ర్థిపై విమ‌ర్శ‌ల దాడి చేయ‌డ‌మే ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవ‌ల చేసిన ప్ర‌భుత్వ, ప్ర‌వేట్ స‌ర్వేలు అన్నింటిలో ఆయ‌న వ్య‌తిరేకంగానే రిపోర్టులు వ‌చ్చాయి. దీంతో ప్రచార హోరు, విమ‌ర్శ‌లు తీరు మార్చాల‌ని ట్రంప్ డిసైడ‌యిన‌ట్టు స‌మాచారం. ట్రంప్ సోమవారం మిన్నెసోటా, విస్కాన్సిన్ ప్రాంతాల‌ను సందర్శించారు. అక్క‌డ బిడెన్ గెలిస్తే భయంకరమైన భవిష్యత్తును చూడాల్సి వ‌స్తుందంటూ ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించాడు. మీడియా బిడెన్‌కు వ‌త్తాసు ప‌లుకుతుంద‌న్న ట్రంప్, అత‌డిలో ప్ర‌జ‌ల చూడ‌ని మ‌రో పార్శం ఉంద‌ని  చెప్పుకొచ్చారు.

మంగళవారం, అరిజోనాలోని యుమా పర్యటన సందర్భంగా ట్రంప్ బిడిన్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై విధానాలపై గొంతెత్త‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక గురువారం బిడెన్ జన్మించిన రాష్ట్రమైన పెన్సిల్వేనియాకు కూడా ట్రంప్ వెళ్ల‌నున్నారు. ప్రెసిడెంట్‌గా ఎన్నికైన దగ్గ‌ర్ను్చి ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు సంచ‌ల‌నంగా మారాయి. కాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌నే తీవ్ర అప‌కీర్తి ఆయ‌న మూట‌గ‌ట్టుకున్నారు. కాగా క‌మ‌లా హారీష్‌ను బిడెన్ త‌మ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంతో అత‌డికి మంచి మైలేజ్ వ‌చ్చింది.

Also Read :

తెలంగాణ అలెర్ట్ : ఈ 15 జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌