పాకిస్తాన్ నేవీ కెప్టెన్ కి గుండెపోటు, ఆదుకున్న భారత కోస్తా తీరదళాలు

పాకిస్తాన్ కు చెందిన బాదర్ హాస్నైన్ అనే నేవీ కెప్టెన్ ని భారత కోస్తా తీరదళాలు ప్రాణాపాయం నుంచి రక్షించాయి.  సముద్రంలో ఎంవి. హయకల్ అనే నౌకలో..

పాకిస్తాన్  నేవీ కెప్టెన్ కి గుండెపోటు, ఆదుకున్న భారత కోస్తా తీరదళాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 18, 2020 | 4:38 PM

పాకిస్తాన్ కు చెందిన బాదర్ హాస్నైన్ అనే నేవీ కెప్టెన్ ని భారత కోస్తా తీరదళాలు ప్రాణాపాయం నుంచి రక్షించాయి.  సముద్రంలో ఎంవి. హయకల్ అనే నౌకలో వస్తున్న ఈయనకు గుండెపోటు రాగా వెంటనే సమీపంలోనే ఉన్న కోస్తా దళ సిబ్బంది ఆయనను విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించారు. గత జులై 13న నౌకలో ఒడిశా లోని గోపాల్ పూర్ కి వస్తుండగా బాదర్ గుండెపోటుకు  గురయ్యాడు.విశాఖ ఆసుపత్రి డాక్టర్ల చికిత్సతో కోలుకున్నాడు. నిన్న ఆయన వాఘా బోర్డర్ ద్వారా తిరిగి పాకిస్తాన్ బయలుదేరి వెళ్ళాడు. తన తండ్రిని మానవతా దృక్పథంతో సకాలంలో ఆదుకున్నందుకు ఆయన కుమార్తె భారత ప్రభుత్వానికి, విశాఖ ఆసుపత్రి డాక్టర్లకు, మన కోస్తా తీర ప్రాంత దళాలకు కృతజ్ఞతలు తెలిపింది.

కానీ పాకిస్తాన్  ఇండియాపై ద్వేషాన్ని వెలిగక్కుతూనే   ఉంది. జమ్మూ కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదులు ఇంచుమించు ప్రతిరోజూ భారత జవాన్లపై, పోలీసులపైనే దాడులు జరుపుతూనే ఉన్నారు. నిన్న బారాముల్లాలో…జరిగిన  టెర్రరిస్టు  కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు సీఆర్ఫీ ఎఫ్ జవాన్లు మృతి చెందారు.