కమలా హారిస్ కన్నా నా కూతురే బెటర్, డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి కమలా హారిస్ కన్నా తన కూతురు, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ ఇవాంకా ట్రంపే బెటరని తన కూతురుని వెనకేసుకొని వచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ !
అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి కమలా హారిస్ కన్నా తన కూతురు, వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ ఇవాంకా ట్రంపే బెటరని తన కూతురుని వెనకేసుకొని వచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ! న్యూ హాంప్ షైర్ లో జరిగిన రిపబ్లికన్ కాంపెయిన్ ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. అధ్యక్షపోస్టుకు మహిళా అభ్యర్థి అయితేనే మంచిదని, ఈ దేశానికి ఓ మహిళను అధ్యక్షురారాలిగా చూడాలనుకుంటున్నానని చెప్పారు. ఇందుకు నా కుమార్తె ఇవాంకా అన్ని విధాలా తగినదని పేర్కొన్నారు. గత ఏడాది వరకు అధ్యక్ష పదవికి అభ్యర్థి రేసులో కమలా హారిస్ ఉన్నారు. అయితే తగినంతమంది ఓటర్ల మద్దతు లేకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఉపాధ్యపదవికి ఆమె డెమొక్రాట్ అభ్యర్థిగా ఉన్నారు. ఏమైనా. ఈ దేశాధ్యక్ష పదవికి మహిళగా హారిస్ మాత్రం తగరని, ఆమె పాపులారిటీ క్రమేపీ తగ్గుతూ వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు.
ఇక ట్రంప్ విధానాలు అమెరికన్లకు హానికరంగా పరిణమించాయని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని కమలా హారిస్ నిప్పులు కక్కారు. అమెరికా నూతన అధ్యక్షునిగా జో బిడెన్ ప్రజల ఆశయాలను తీర్చగలరని ఆమె అన్నారు.