క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని న‌రేంద్ర‌మోదీ క్రీడాకారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజ‌ర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయ‌న నివాళుల‌ర్పించారు...

  • Sanjay Kasula
  • Publish Date - 1:38 pm, Sat, 29 August 20
క్రీడాకారులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని న‌రేంద్ర‌మోదీ క్రీడాకారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజ‌ర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా ఆయ‌న నివాళుల‌ర్పించారు. హాకీ స్టిక్‌తో ధ్యాన్‌చంద్ చేసిన మ్యాజిక్‌ను దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌ని ప్ర‌ధాని మోదీ ట్విట్ట‌ర్‌లో కొనియాడారు. క్రీడాకారుల విజ‌యం కోసం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తున్న వారి కుటుంబ‌స‌భ్యులు, కోచ్‌లు, తోటి ఆట‌గాళ్ల‌ను ప్ర‌శంసించాల్సిన రోజు ఇద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

జాతీయ క్రీడాదినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఈ రోజు ధ్యాన్‌చంద్‌కు ఘ‌న నివాళులు అర్పిస్తున్నాం. హాకీ స్టిక్‌తో ధ్యాన్‌చంద్ చేసిన మ్యాజిక్‌ను ఎప్పటికీ మ‌రిచిపోలేం. జాతీయ క్రీడాదినోత్స‌వం జ‌రుపుకుంటున్న ఈ రోజు.. ప్ర‌తిభ‌గ‌ల క్రీడాకారుల విజ‌యం కోసం శ్రమిస్తున్న వారి కుటుంబ‌స‌భ్యులు, కోచ్‌లు, స‌హ క్రీడాకారుల‌ను అభినందించాల్సిన రోజు’ అని ప్ర‌ధాని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.