నాగార్జున సాగర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

అసలే ఆదివారం.. నాగార్జునసాగర్ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ అందాలను తనివితీరా చూసి వద్దామనుకుంటున్న పర్యాటకులకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రాజెక్టును తిలకించేందుకు విపరీతంగా జనం తరలి వస్తుండటంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో ఆదివారం పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలను పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను పిడుగురాళ్ల అడ్డంకి-నార్కెట్ పల్లి హైవే మీదుగా వెళ్లాల్సిందిగా […]

నాగార్జున సాగర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2019 | 12:13 PM

అసలే ఆదివారం.. నాగార్జునసాగర్ వద్ద ఉప్పొంగుతున్న కృష్ణమ్మ అందాలను తనివితీరా చూసి వద్దామనుకుంటున్న పర్యాటకులకు పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రాజెక్టును తిలకించేందుకు విపరీతంగా జనం తరలి వస్తుండటంతో జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో ఆదివారం పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

హైదరాబాద్ నుంచి మాచర్ల, గుంటూరు వెళ్లే వాహనాలను పెద్దవూర, హాలియా, మిర్యాలగూడ మీదుగా మళ్లించారు. గుంటూరు, మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను పిడుగురాళ్ల అడ్డంకి-నార్కెట్ పల్లి హైవే మీదుగా వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా సాగర్ మీదుగా ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్నవారికి పోలీసులు చేదుకబురు చెప్పారు.

నాగార్జున సాగర్ మీదుగా వెళ్లే ప్రయాణాలు ఆదివారం వాయిదా వేసుకోవాలని సూచించారు. నాగార్జున సాగర్ రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తే వెయ్యి రూపాయల ఫైన్ విధించనున్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి డ్యామ్ వరకు మినీ బస్సు సదుపాయాన్ని కల్పించారు. సాగర్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం 500 పోలీసులు విధులు నిర్వహించనున్నారు.