వారానికి ఒక్కసారి తిన్నా చాలు.. శరీరం ఉక్కులా మారిపోయిద్ది.. పైగా డబుల్ స్టామినా..
బోటి కూర కేవలం రుచికరమైన నాన్‌వెజ్ వంటకం మాత్రమే కాదు, ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12, కొల్లాజెన్ వంటి పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన ఆహారం కూడా. కండరాల బలం, రోగనిరోధక శక్తి, రక్తహీనత నివారణ, జీర్ణక్రియ మెరుగుదలకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

భారతదేశ సాంప్రదాయ వంటకాల్లో బోటి కూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన పోషకాహారం. ఈ కూర మేక లేదా గొర్రె పేగులతో బోటి కూరను అద్భుతంగా తయారు చేస్తారు.. తరతరాలుగా మన పెద్దలు ఆరోగ్యం కోసం దీనిని తమ ఆహారంలో భాగంగా చేసుకున్నారు. బోటి కూరను క్రమం తప్పకుండా లేదా.. వారానికి ఒకసారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.. భీముడిలాంటి బలాన్ని పొందవచ్చని పెద్దలు చెబుతుంటారు.
పోషకాల గని బోటి కూర:
బోటి కూరలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్, విటమిన్ బి12 అధిక మొత్తంలో లభిస్తాయి. వీటితో పాటు విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఫైబర్ కూడా బోటి కూరలో ఉంటాయి. మటన్, మటన్ మరాగ్, మటన్ పాయా సూప్ వంటి వంటకాలతో పాటు బోటి కూర కూడా తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. అందుకే.. నాన్ వెజ్ ప్రియులు బోటి కూరను ఇష్టంగా తింటారు.
కండరాల వృద్ధి – రోగనిరోధక శక్తి:
బోటి కూర ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. మన శరీర కండరాల వృద్ధికి ప్రోటీన్ అత్యవసరం. కండరాలను బలంగా ఉంచడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి బోటి కూర ఒక సమర్థవంతమైన మార్గం. అంతేకాకుండా, ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.
రక్తహీనత నివారణ – నాడీ వ్యవస్థ ఆరోగ్యం:
బోటీలో ఐరన్, విటమిన్ బి12 వంటి కీలక పోషకాలు ఉన్నాయి. రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు ఐరన్ అవసరం కాగా, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి12 తప్పనిసరి. రక్తహీనతతో బాధపడే వారికి, అలాగే నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్నవారికి బోటి కూర చాలా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇది శరీరంలోని ముఖ్యమైన జీవక్రియలకు మద్దతు ఇస్తుంది.
జీర్ణక్రియ – బరువు నియంత్రణ:
బోటి కూరలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఆహారం. అలాగే, డయాబెటిస్ ఉన్నవారికి కూడా బోటి కూర అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. మలద్ధకాన్ని నివారించి.. గట్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ మొత్తం శరీర ఆరోగ్యానికి కీలకం.
చర్మం – ఎముకల ఆరోగ్యం:
బోటి కూరలో కొల్లాజెన్ అధికంగా ఉంటుంది. కొల్లాజెన్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది ఎముకలకు దృఢత్వాన్ని అందించి, కీళ్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బోటి కూర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దీనిలో కొవ్వు, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు దీనిని ఎక్కువగా తినకుండా మితంగా తీసుకోవడం మంచిది.
మొత్తంగా, బోటి కూర మన సాంప్రదాయ ఆహారంలో ఒక విలువైన భాగం. దీనిని సరైన పద్ధతిలో, మితంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం.. అపారమైన బలాన్ని పొందవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
