AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుప్రీంకు నలుగురు జడ్జిల నియామకానికి ఓకే..

సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతున్నారు. వీరి నియామకాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు […]

సుప్రీంకు నలుగురు జడ్జిల నియామకానికి ఓకే..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 22, 2019 | 9:00 PM

Share

సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతున్నారు. వీరి నియామకాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫారసులను గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. వీరి సీనియారిటీ, ప్రాంతీయతలను కారణాలుగా చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

జస్టిస్ బోస్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, జస్టిస్ బోపన్న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేస్తున్నారు. జస్టిస్ గవాయ్ బోంబే హైకోర్టు జడ్జిగానూ, జస్టిస్ కాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది జడ్జిలను నియమించేందుకు అనుమతి ఉంది. ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పటి వరకు 27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. తాజాగా నలుగురిని నియమిస్తే అనుమతి ఉన్న సంఖ్యలో న్యాయమూర్తులను నియమించినట్లవుతుంది.

Follow Us
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
జడ్జి కుర్చీలో గణపయ్య.. సుప్రీంకోర్టు సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణ!
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
ఆ సమస్యకు చెక్‌..వాట్సాప్‌లో ఈ ట్రిక్‌ గురించి తెలిస్తే షాకవుతారు
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
2027 ఆసియా కప్ నకు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్..!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
అబ్బబ్బా..వీరికి రెండు మహా యోగాలు.. ఇక తిరుగులేని లాభాలు!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
ఈ కొత్త రకం సీసీ కెమెరా ఫీచర్స్, ధర తెలిస్తే వెంటనే కోనేస్తారు..!
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
బంగారంలో ఇప్పుడు లక్ష పెడితే.. 10ఏళ్ల తర్వాత ఎంత వస్తుందో తెలుసా?
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
మేడమ్ సార్ మేడమ్ అంతే..!
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
US విషాదం.. ట్రాక్‌పై జారిపడ్డ స్నేహితుడు.. కాపాడబోయి యువతి సైతం
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది..
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం