ఫిబ్రవరి 27 నాటి ఘటన.. సొంత చాపర్‌నే కూల్చేసిన క్షిపణి..
బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనంతరం భారత్ – పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిబ్రవరి 27న జరిగిన చాపర్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ క్రమంలో ఆ చాపర్‌ను కూల్చేసింది భారత వైమానిక దళ క్షిపణి అని తేలింది. హెలికాప్టర్ ఎగిరిన 12సెకన్లకే ప్రమాదవశాత్తు దీనిని కూల్చేసినట్లు తేలింది. ఫిబ్రవరి 27న చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఆ ఎంఐ-17 హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురితో పాటు కింద […]
బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అనంతరం భారత్ – పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిబ్రవరి 27న జరిగిన చాపర్ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ క్రమంలో ఆ చాపర్‌ను కూల్చేసింది భారత వైమానిక దళ క్షిపణి అని తేలింది. హెలికాప్టర్ ఎగిరిన 12సెకన్లకే ప్రమాదవశాత్తు దీనిని కూల్చేసినట్లు తేలింది. ఫిబ్రవరి 27న చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఆ ఎంఐ-17 హెలికాప్టర్‌లో ఉన్న ఆరుగురితో పాటు కింద ఉన్న ఓ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన జరిగిన రోజున ఉదయం 10- 10.30 గంటల మధ్య పాకిస్థాన్‌కు చెందిన 24 యుద్ధ విమానాలు సరిహద్దు రేఖను దాటి వచ్చాయి. అయితే వాటిలో ఎఫ్-16 విమానాలు కూడా ఉన్నాయి. భారత సైనిక స్థావరాల దిశగా ఆయుధాలను ప్రయోగించాయి. ఈ క్రమంలో వాటిని తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళానికి చెందిన ఎనిమిది యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. మరోవైపు కశ్మీర్ వ్యాప్తంగా వాయు రక్షణ దళం అప్రమత్తంగా ఉంది.
ఇదే సమయంలో శ్రీనగర్ విమానాశ్రయ వద్ద ఉన్న రాడార్లు తక్కువ ఎత్తులో ఎగురుతున్న హెలికాప్టర్‌ను గుర్తించాయి. అయితే అది మన వైమానిక దళానిదా? శత్రువులదా? అని గుర్తించడంలో పొరపాటు జరిగింది. శత్రువులదిగా భావించిన భారత వైమానిక దళం.. క్షిపణిని ప్రయోగించి కూల్చివేశారు. 12 సెకన్లలో ఆ క్షిపణి హెలికాప్టర్‌ను కూల్చివేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్‌ను విధుల నుంచి తప్పించారు. దీనిపై విచారణ ముగింపు దశలో ఉండగా.. భారత వైమానిక దళం ఏవోసీపై చర్యలు తీసుకోవడం గమనార్హం.