వైమానిక రణరంగంలోకి అర్హత సాధించిన నారీమణి…

ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన అత్యంత అరుదైన ఘనత సాధించారు. యుద్ధ విమానాన్ని ఉపయోగించి, పగటిపూట యుద్ధం చేయడానికి ఆమె అర్హత సాధించారు. ఇక మిగ్-21 బైసన్ సూపర్‌సానిక్ జెట్‌తో ఆమె యుద్ధ రంగంలో తన సత్తా చాటవచ్చు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. భావన బిహార్‌లోని దర్భంగాకు చెందినవారు. మిగ్-21 ట్రైనింగ్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. బికనీర్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌లో ఆమె శిక్షణ పొందారు. 2017 నవంబరులో భావన ఫైటర్ […]

వైమానిక రణరంగంలోకి అర్హత సాధించిన నారీమణి...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 22, 2019 | 9:59 PM

ఫ్లైట్ లెఫ్టినెంట్ భావన అత్యంత అరుదైన ఘనత సాధించారు. యుద్ధ విమానాన్ని ఉపయోగించి, పగటిపూట యుద్ధం చేయడానికి ఆమె అర్హత సాధించారు. ఇక మిగ్-21 బైసన్ సూపర్‌సానిక్ జెట్‌తో ఆమె యుద్ధ రంగంలో తన సత్తా చాటవచ్చు. ఈ ఘనత సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

భావన బిహార్‌లోని దర్భంగాకు చెందినవారు. మిగ్-21 ట్రైనింగ్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. బికనీర్‌లోని నాల్ ఎయిర్‌బేస్‌లో ఆమె శిక్షణ పొందారు. 2017 నవంబరులో భావన ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరారు. 2018 మార్చిలో మిగ్-21 బైసన్‌ను మొదటిసారి స్వయంగా నడిపారని భారత వాయు సేన అధికార ప్రతినిథి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు.