రేపు సీఈసీతో చంద్రబాబు భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును వారి దృష్టికి తీసుకురానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలవనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీల గుర్తు మారడం, సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను సీఈసీకి దృష్టికి తీసుకెళ్లి నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రజల […]

రేపు సీఈసీతో చంద్రబాబు భేటీ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 13, 2019 | 12:27 PM

ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరిగిన తీరును వారి దృష్టికి తీసుకురానున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరాను కలవనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీల గుర్తు మారడం, సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే ఇతర గుర్తులకు ఓటు మరలిపోవడం వంటి ఘటనలను సీఈసీకి దృష్టికి తీసుకెళ్లి నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రజల సహనానికి ఎన్నికల సంఘం అగ్నిపరీక్ష పెట్టిందని చంద్రబాబు మండిపడిన విషయం తెలిసిందే. వీవీ ప్యాట్‌ల లెక్కింపుపై టీడీపీ సుప్రీంలో రివిజన్ పిటిషన్ వేయనుంది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి.