AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ నిర్మాత మృతి..విషాదంలో టాలీవుడ్..

టాలీవుడ్‌ని విషాదాలు వీడటం లేదు. ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతి మరచిపోకముందే ఇటీవలే నటుడు ఆలీ తల్లీ గారు, హీరో శ్రీకాంత్ తండ్రి దూరమయ్యి..వారి కుటుంబాల్లో దు:ఖాన్ని మిగిల్చారు. తాజాగా రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు జనార్ధన రావు కాలం చేశారు. ప్రస్తుత టాలీవుడ్ వర్గాలకు మరో చేదు వార్త అందింది. సీనియర్ నిర్మాత, శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్, గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్స్‌లో నిర్మాణ భాగస్వామి  సి. వెంకట్ రాజు కన్నుమూశారు. […]

ప్రముఖ నిర్మాత మృతి..విషాదంలో టాలీవుడ్..
Ram Naramaneni
|

Updated on: Mar 09, 2020 | 7:09 AM

Share

టాలీవుడ్‌ని విషాదాలు వీడటం లేదు. ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతి మరచిపోకముందే ఇటీవలే నటుడు ఆలీ తల్లీ గారు, హీరో శ్రీకాంత్ తండ్రి దూరమయ్యి..వారి కుటుంబాల్లో దు:ఖాన్ని మిగిల్చారు. తాజాగా రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు జనార్ధన రావు కాలం చేశారు. ప్రస్తుత టాలీవుడ్ వర్గాలకు మరో చేదు వార్త అందింది. సీనియర్ నిర్మాత, శ్రీ విజయలక్ష్మి ప్రొడక్షన్స్, గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్స్‌లో నిర్మాణ భాగస్వామి  సి. వెంకట్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతోన్న ఆయన మార్చి 8న మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ విషయాన్ని పీఆర్‌ఓ బీఏ రాజు కన్ఫామ్ చేశారు. సోమవారం వెంకట్ రాజు అంత్యక్రియలు చెన్నైలో జరుగునున్నాయి.

మరో నిర్మాత బి. శివరాజుతో కలిసి వెంకట్ రాజు పలువురు అగ్ర కథానాయుకులతో సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్‌తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది.  ‘2 టౌన్ రౌడీ’, ‘పవిత్ర బంధం’, ‘పెళ్లిచేసుకుందాం’,   ‘ఘర్షణ’ వంటి సూపర్ హిట్ మూవీస్‌ను వెంకట్ రాజు నిర్మించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా చేసిన  ‘చక్రం’ వంటి మంచి సినిమాకు కూడా ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. వెంకట్ రాజు మరణ వార్త విని.. టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత