Gold Price: బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయి… దేశ వ్యాప్తంగా పెరిగిన గోల్డ్ ధరలు..
Today Gold Price: లాక్ డౌన్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తర్వాత మళ్లీ తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కాస్త నెలచూపులు చూసిన గోల్డ్ ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గురువారం..
Today Gold Price: లాక్ డౌన్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తర్వాత మళ్లీ తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కాస్త నెలచూపులు చూసిన గోల్డ్ ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా పది గ్రాముల బంగారంపై సుమారు రూ.150 వరకు పెరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 47,910 (బుధవారం ధర రూ.47,800) ఉండగా.. 24 క్యారెట్లు రూ.52,260 (బుధవారం ధర రూ. 52,150)గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 48,100 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. (బుధవారంతో పోలీస్తే రూ.150 పెరిగింది). 24 క్యారెట్ల గోల్డ్ రూ. 49,960 గా (బుధవారంతో పోలీస్తే రూ.160 పెరిగింది) నమోదైంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,960గా ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 45,800 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్.. రూ.49,960గా పలికింది.
Also Read: Petrol Price: దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోన్న ఇంధన ధరలు… ఈ రోజు పెట్రోల్, డీజీల్ ధరలు ఎలా ఉన్నాయంటే..