Petrol Price: దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోన్న ఇంధన ధరలు… ఈ రోజు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..

Today Fuel Prices: గతకొన్ని రోజులగా రోజురోజుకీ స్వల్పంగా పెరుగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలకు గురువారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో..

Petrol Price: దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతోన్న ఇంధన ధరలు... ఈ రోజు పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 7:25 AM

Today Fuel Prices: గతకొన్ని రోజులగా రోజురోజుకీ స్వల్పంగా పెరుగుతోన్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలకు గురువారం కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను రోజువారీగా సవరిస్తోన్న నేపథ్యంలో.. ప్రతిరోజూ ఇంధన ధరల్లో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజు రోజుకీ స్వల్ప మొత్తంలో పెట్రోల్‌, ధరలు తగ్గడమో, పెరగడమే జరుగుతోంది. ఇక తాజాగా గురువారం దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.63 ఉండగా (బుధవారంతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు), డీజీల్‌ ధర రూ. 82.26 గా పలికింది. ఇక కరీంనగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.78 (బుధవారం ధర 88.50) ఉండగా, డీజీల్‌ ధర రూ.82.39గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర. 91.83 ఉండగా (బుధవారం నాటి ధర రూ.91.33), లీటర్‌ డీజీల్‌ రూ.84.92గా (బుధవారం నాటి ధర రూ.84.49) ఉంది. విశాఖపట్నంలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర. 90.14 పలకగా, డీజీల్‌ రూ.83.32 గా నమోదైంది. ఇక గుంటూరులో లీట్‌ పెట్రోల్‌ ధర రూ.91.83 ఉండగా, డీజీల్‌ విషయానికొస్తే రూ. 84.92గా పలికింది.

ఇక దేశరాజధాని ఢిల్లీ విషయానికొస్తే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.20 కాగా డీజీల్‌ ధర రూ.75.38 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.80 కాగా, లీటర్‌ డీజీల్‌ ధర రూ.82.13 గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87.85 ఉండగా, డీజీల్‌ ధర రూ.80.67గా నమోదైంది.

Also Read: కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు.. సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా..? నిరుద్యోగులకు ఉపశమనం దొరికేనా..?