కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనానికి తగ్గుతున్న భక్తులు సంఖ్య..

తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో క్రమక్రమంగా పెరుగుతోన్న కరోనా కేసుల కారణంగా టికెట్లు బుక్ చేసుకున్నా కూడా భక్తులు దర్శనానికి రాని పరిస్థితి ఏర్పడింది.

కరోనా ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనానికి తగ్గుతున్న భక్తులు సంఖ్య..
Follow us

|

Updated on: Jul 24, 2020 | 1:03 PM

Tirumala Darshan Huge Decrease In Pilgrims: ఒకప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి ఇసుకేస్తే రాలనంత జనం ఉండేవారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా భక్తులు రాక రోజురోజుకూ తగ్గుతోంది. తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో క్రమక్రమంగా పెరుగుతోన్న కరోనా కేసుల కారణంగా టికెట్లు బుక్ చేసుకున్నా కూడా భక్తులు దర్శనానికి రాని పరిస్థితి ఏర్పడింది. రోజుకి పన్నెండు వేల మందిని టీటీడీ అనుమతినిచినప్పటికీ.. రోజూ నాలుగు నుంచి ఐదు వేలు మంది భక్తులు మాత్రమే దర్శనానికి వస్తున్నారు.

తిరుమల కొండపై 170 మంది ఉద్యోగులకు, 20మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపధ్యంలో భక్తులు దర్శనాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక భక్తులు లేక ఆలయ పరిసరాలు వెలవెలబోతున్నాయి.కాగా, కరోనా విషయంలో టీటీడీ కొండపై అత్యున్నత జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ వారంలో శ్రీవారిని 43,411 మంది భక్తులు దర్శించుకోగా.. 15,404 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అయితే సాధారణ రోజుల్లో రోజుకు 80వేల మంది శ్రీవారిని దర్శించుకుంటారని.. 25వేల మంది తలనీలాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!