ఇక ఖైదీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చు..!

కరోనా వైరస్ కారణంగా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు జైలు అధికారులు. ప్రస్థుత సమయంలో ఖైదీలతో మిలాఖత్ అయ్యే కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఖైదీలతో వారి కుటుంబసభ్యులు,బంధువులు,స్నేహితులు మాట్లాడేందుకు అనుమతించాలని జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు.

ఇక ఖైదీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడవచ్చు..!
Follow us

|

Updated on: Jul 29, 2020 | 4:58 AM

కరోనా వైరస్ అన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. అటు జైలులో ఉన్న ఖైదీలను సైతం వదలడం లేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు జైలు అధికారులు. ప్రస్థుత సమయంలో ఖైదీలతో మిలాఖత్ అయ్యే కుటుంబసభ్యుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఖైదీలతో వారి కుటుంబసభ్యులు,బంధువులు,స్నేహితులు మాట్లాడేందుకు అనుమతించాలని జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు. దీని కోసం ఢిల్లీలోని తీహార్, రోహిణి, మండోలి జైళ్లతోపాటు 16 సబ్ జైళ్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నారు. ఖైదీలే కాకుండా జైలు వార్డర్లకు కూడా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో సందర్శకుల ములాఖత్ నిలిపివేసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఖైదీలతో మాట్లాడే అవకాశం కల్పించనున్నారు. వచ్చే వారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కంప్యూటర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, వర్చువల్ తరగతుల్లా జైళ్లలోని ఖైదీలను ఆన్ లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగక్షేమలు తెలుసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే యూకే, యూఎస్ లతో పాటు ముంబైలోని బైకుల్లా జైలులోని ఖైదీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో తీహార్ జైలులోని ఖైదీలకు కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 14వేల మంది ఖైదీలు ఉంటున్నారు. అందులో 141 మంది కరోనా బారినపడ్డారు. మిగతా ఖైదీలు వారి న్యాయవాదులు, కుటుంబసభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు అనుమతిస్తామని తీహార్ జైలు అధికారులు చెప్పారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు