ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బంతారా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది.  కల్తీ మద్యం సేవించి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

ప్రాణాలు తీసిన కల్తీ మద్యం, ముగ్గురు దుర్మరణం, మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
Follow us

|

Updated on: Nov 13, 2020 | 3:49 PM

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బంతారా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది.  కల్తీ మద్యం సేవించి ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  స్థానిక ట్రామా కేర్ సెంటర్‌లో వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుందర్ లాల్ (35),రాజ్‌కుమార్ (32), అచ్చె (30) మరో ఇద్దరు వ్యక్తులు కలిసి గురువారం రాత్రి లిక్కర్ సేవించారు. అయితే రాత్రి నిద్రించిన తర్వాత అచ్చె, సుందర్‌లాల్‌, రాజ్‌కుమార్ ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారి వారి ఫ్యామిలీ మెంబర్స్ స్థానిక ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ రాత్రే వారు మృతి చెందారు. వారితోపాటు మద్యం సేవించిన మిగతా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుల పోస్టుమార్టం నివేదిక వస్తే వారి మరణాలకు రీజన్ తెలుస్తుందన్నారు. వారు కల్తీ మద్యం తాగడం వల్ల మృతిచెందారా లేక అతిగా మద్యం సేవించడంవల్ల చనిపోయారా అనేది పోస్టుమార్టం రిపోర్టుతో తేలిపోతుందని వెల్లడించారు. అదేవిధంగా పరారీలో ఉన్న లిక్కర్ షాపు ఓనర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం షాపుల యజమానుల ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిథులు, అధికారులు అక్రమ మద్యాన్ని అరికట్టి తమ కుటుంబాలను కాపాడాలని కోరుతున్నారు. కాగా ఘటనలో ఎంతటివారు ఉన్నా చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు తెలిపారు.

Also Read : 

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్

రోజూ ‘జానీ వాకర్’ ఫుల్ బాటిల్ తాగేస్తున్న దున్నపోతు

‘మన్యం పులి’ ఐపీఎల్‌లో వేట మొదలెట్టబోతుంది !

సూర్య ఈజ్ బ్యాక్, సుధ కొంగర రాక్