డీఎస్పీ vs డీఎస్పీ: దూసుకుపోతున్న ఉప్పెన, రంగ్‌ దే పాటలు.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌

సినిమా ఇండస్ట్రీలో సమకాలిన వ్యక్తుల మధ్య పోటీ ఉండటం సాధారణమే. కానీ సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌కి మాత్రం ఇప్పుడు అతడే పోటీగా మారిపోయారు

డీఎస్పీ vs డీఎస్పీ: దూసుకుపోతున్న ఉప్పెన, రంగ్‌ దే పాటలు.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 13, 2020 | 3:17 PM

Devi Sri Prasad: సినిమా ఇండస్ట్రీలో సమకాలిన వ్యక్తుల మధ్య పోటీ ఉండటం సాధారణమే. కానీ సంగీత దర్శకుడు రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌కి మాత్రం ఇప్పుడు అతడే పోటీగా మారిపోయారు. ఒకరోజు గ్యాప్‌తో వచ్చిన ఆయన పాటలు సంగీత ప్రియులను చాలా ఆకట్టుకుంటున్నాయి. ఇక దేవీ ఫ్యాన్స్ అయితే ఏ పాట వినాలి అన్న కన్ఫ్యూజన్‌లో ఉంటూ రెండు పాటలను లూప్‌లో పెట్టేసుకుంటున్నారు. (ఫ్యాన్స్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ టీమ్‌ స్పెషల్‌ దీపావళి గిఫ్ట్‌.. సంప్రదాయ దుస్తుల్లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌, చెర్రీ)

అసలు విషయంలోకి వెళ్తే.. వైష్ణవ్‌ తేజ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెనలోని మూడో పాట రంగులద్దుకున్న బుధవారం విడుదలైంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను హరిప్రియ, యాసిన్‌ నిసర్‌ ఆలపించారు. మహేష్‌ బాబు ఈ పాటను లాంచ్‌ చేశారు. ఇద్దరు ప్రేమికులు లోకాన్ని మరిచిపోయి పాడుకునే విధంగా వచ్చిన ఈ పాట అందరినీ బాగా ఆకట్టుకుంది. 24 గంటలు అవ్వకముందే ఈ పాట 1 మిలియన్‌ వ్యూస్‌ని సాధించింది. అంతేకాదు యూట్యూబ్‌లో ట్రెండ్‌లో ఉంది. ఆది, రష్మిక మందన, అనసూయ వంటి వారు సైతం ఈ మెలోడీపై ప్రశంసలు కురిపించారు. ఇలా రంగులద్దుకున్న హిట్‌తో ఉప్పెన నుంచి హ్యాట్రిక్‌ని ఖాతాలో వేసుకున్నారు డీఎస్పీ. (‘బ్రోచేవారెవరురా’ దర్శకుడితో నాని నెక్ట్స్ మూవీ.. టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోన్న నజ్రియా)

ఇక రంగులద్దుకున్న పాట వచ్చిన 24 గంటలకు నితిన్‌, కీర్తిల రంగ్‌దేలోని ఏమిటో ఇది అనే మరో మెలోడీ వచ్చింది. ఈ పాటకు కూడా శ్రీమణి సాహిత్యం అందించగా.. హరిప్రియ, కపిల్‌ కపిలన్‌ ఆలపించారు. ఇన్‌స్టాంట్‌ హిట్‌గా అందరికీ ఎక్కేసిన ఈ పాటకు సైతం 24 గంటలు గడవకముందే 1 మిలియన్‌ వ్యూస్ వచ్చేశాయి. ఇలా వరుసగా రెండు హిట్లను ఇచ్చి వ్యూస్‌ విషయంలో తనకు తానే పోటీగా మారిపోయారు దేవీ శ్రీ ప్రసాద్‌. మరోవైపు సంగీత ప్రియులు కూడా డీఎస్పీ బ్యాక్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. (కరోనా లక్షణాలు చాలా ఇబ్బంది పెట్టాయి.. ఎవరో నా చెస్ట్‌పై అదిమి కూర్చునట్లు అనిపించేది)

అయితే టాలీవుడ్‌లో దేవీకి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఒకప్పుడు అతడి పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు మూవీ సగం హిట్‌ అని అందరూ భావించేవారు. యంగ్‌ హీరోలు మొదలు స్టార్ హీరోలు కూడా అతడికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఈ మధ్య కాలంలో డీఎస్పీ మ్యూజిక్‌పై చాలా విమర్శలు వచ్చాయి. చాలా మంది అతడిని దూరం పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వాటన్నింటికి చెక్ పెడుతూ తనలోని టాలెంట్‌ను మరోసారి బయటపెట్టారు దేవీ. (మేనకోడలితో ప్రభుదేవా రెండో వివాహం..!)