ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు చిన్నారులను కాటేసిన కట్లపాము
కృష్ణజిల్లాలో పాముకాట్లు కలవరపెడుతున్నాయి. దివిసీమ ప్రాంతంలో పాముకాట్ల బెడద ఎక్కువగా ఉంటుందోన్న విషయం తెలిసిందే.

కృష్ణజిల్లాలో పాముకాట్లు కలవరపెడుతున్నాయి. దివిసీమ ప్రాంతంలో పాముకాట్ల బెడద ఎక్కువగా ఉంటుందోన్న విషయం తెలిసిందే. తాజాగా ఘంటసాల మండంలం గొల్లపాలెం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లల్ని కట్లపాము కాటేసింది. సిరిప్రణవి(10), ప్రవీణ్(8), ప్రజ్వల్(7)లు నిద్రపోతుండగా ఇంట్లోకి దూరిన పాము కాటేసింది. పిల్లలను హుటాహుటిన మొవ్వ పీహెచ్‌సీ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో బాధిత చిన్నారులు కోలుకన్నారు. కాగా కట్ల పాము అత్యంత విషపూరితం అన్న విషయం తెలిసిందే.