ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే
పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసేందుకు వచ్చే మార్చి నెల ఆఖరులోపు రూ.15 వేల కోట్లు అవసరమని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసేందుకు వచ్చే మార్చి నెల ఆఖరులోపు రూ.15 వేల కోట్లు అవసరమని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఇప్పటికే ఏపీకి ఇవ్వాల్సిన రూ.3805.62 కోట్లు రిలీజ్ చేయాలని కోరారు. ప్రస్తుత ఫైనాన్సియల్ ఇయర్‌లో అవసరమైన రూ.15 వేల కోట్ల లోన్ తీసుకునేందుకు నాబార్డును అనుమతించాలని విన్నవించారు. నిధుల విడుదలలో నిర్వహణపరమైన జాప్యాన్ని నిరోధించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వద్ద రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు .
నిధుల విడుదలకు జఠిలంగా ఉన్న విధివిధానాలను సులభతరం చేయాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు పోలవరానికి కావాలని కోరారు. కాల్వలకు రూ.5 వేల కోట్లు, ప్రధాన డ్యాం పనులకు రూ.5 వేల కోట్లు, పునరావాసానికి రూ.5 వేల కోట్లు అవసరమని సీఎం లేఖలో వివరించారు. ఇప్పటివరకు పోలవరంపై 12 వేల 312.088 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు.
Also Read : ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు చిన్నారులను కాటేసిన కట్లపాము