శ్రీవారి దర్శనం టిక్కెట్లకు భారీ స్పందన
శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వచ్చే నెలలో తిరుమలేశుడి దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఇప్పటికే 35శాతం టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు....

Tirumala Srivari Darshanam : శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం టిక్కెట్లకు భక్తుల నుంచి భారీ స్పందన లభించింది. వచ్చే నెలలో తిరుమలేశుడి దర్శనానికి సంబంధించి ఆన్‌లైన్‌లో ఇప్పటికే 35శాతం టికెట్లను భక్తులు కొనుగోలు చేశారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి టీటీడీ బోర్డు 1,66,475 టిక్కెట్లను భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటికే 58,455 టిక్కెట్లను భక్తులు కొనుగోలు చేశారు.
అయితే సెప్టెంబర్ మాసంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 19 నుంచి 27 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అంతేకాదు సెప్టెంబరు మాసంలో శ్రీవారికి విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య ఉంది. ఇక, 18వ తేదీన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఇవి కూడా ఆన్‌లైన్ టికెట్ల అమ్మకాలపై ప్రభావం ఉంది. స్వామి వారి దర్శనంతోపాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన వచ్చని భక్తులు ఆశిస్తున్నారు.