వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి సముద్రంలా మారింది. లంకలన్నీ మునిగిపోయాయి. ఎగువ భాగంలో అన్ని నదులూ పొంగడంతో పాటు, వర్షాలు పడుతుండడం వల్ల పెద్ద వరదే వస్తోంది.

వరద ఉద్ధృతి.. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 5:37 PM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. రాజమండ్రి వద్ద అఖండ గోదావరి సముద్రంలా మారింది. లంకలన్నీ మునిగిపోయాయి. ఎగువ భాగంలో అన్ని నదులూ పొంగడంతో పాటు, వర్షాలు పడుతుండడం వల్ల పెద్ద వరదే వస్తోంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ వద్ద 17.75 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 175 గేట్లు పూర్తిగాఎత్తివేత 19 లక్షలు క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

2013 తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రావడం మళ్ళీ ఈ ఏడాదే. రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రతీ గంటకూ వేల క్యూసెక్కుల ప్రవాహం పెరుగుతోంది. . రాజమండ్రిలోని ఘాట్లు, ఇసుక ర్యాంపులు నిండా మునిగాయి. డ్రెడ్జింగ్‌ మిషన్లు, పడవలు ర్యాంపుల్లోనే ఉండిపోయాయి. కాఫర్‌ డ్యామ్‌ వద్ద అధికంగా వరద నీరు ఉండడం వల్ల ధవళేశ్వరం బ్యారేజీకి కాస్త ఒత్తిడి తగ్గినట్టు చెప్తున్నారు.

Read More:

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!