టీవీఎస్ ఐక్యూబ్.. ప్రముఖ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్కూటర్ రూ. 1,85,373 నుంచి రూ. 94,999 (ఎక్స్-షోరూమ్)కు అందుబాటులో ఉంది. అలాగే 2.2 కేడబ్ల్యూహెచ్, 3.4 కేడబ్ల్యూహెచ్, 5.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికలలో లభిస్తోంది. ఒక్కసారి చార్జింగ్ తో 75 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణం చేయవచ్చు. టీఎఫ్ టీ స్క్రీన్, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, వాయిస్ అసిస్ట్ అలెక్సా స్కిల్‌సెట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.