South Sudan Tribes Worship Cow: ఆ దేశంలోని ఆటవిక తెగవారు ఆవును పవిత్రమైన జంతువుగా పూజిస్తారు.. ఎందుకంటే..!
హిందువులకు ఆవు అతి పవిత్రమైన జంతువు. దైవంతో సమానంగా గోమాత అంటూ పూజిస్తారు. అయితే మనదేశంలోనే కాదు.. ఆఫ్రికాలోని అతి పేద దేశమైన సౌత్ సుడాన్ లో కూడా ఆవు దేవతగా పూజలను అందుకుంటుంది. అక్కడ ముండారి, దీన తెగ వారు ఆవులను ఆరాధిస్తారు. వారి సంస్కృతి, సంప్రదాయం అంతా ఆవులతోనే ముడిపడిఉంది.
Updated on: Apr 12, 2021 | 7:36 PM

ముండారి తెగకు జంతువులతో ముఖ్యంగా ఆవులతో మంచి అనుబంధం ఉంది. కుటుంబంలోని ప్రతి సభ్యునికి 10-12 ఆవులు ఉంటాయి. వాటిని ఎంతో ప్రేమతో సంరక్షిస్తారు. ఆవు పాలు, మూత్రం. పేడను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు.

ఇక దీన తెగకు కూడా పశు సంపదతో ఎక్కువ ఆత్మీయ బంధం ఉంది. వీరి జీవన విధానంలో ఆవులతో విడదీయరాని అనుబందం ఉంది వ్యవసాయం ,పాలు వంటి ఉత్పత్తుల కోసం ఆవులను ఎక్కువగా ఉపయోగిస్తారు . వారి సంస్కృతిలో ఆవుకు ప్రాముఖ్యత ఎక్కువ. మతసంబంధమైన సంప్రదాయ రూపాలకు ఈ తెగ ప్రసిద్ధి చెందింది.

ఆవు పొదుగు నుండి నేరుగా పాలు తాగడం ఈ జాతి ప్రత్యేకత.

ఇక ముండారి తెగ వారు ఆవును మాంసాహారంగా ఎప్పడూ చూడరు. ఇక మతసంబంధ పూజలలో కూడా ఆవు కళేబారన్ని ఉపయోగిస్తారు.

ఈ తెగ కేశాల రక్షణ కోసం ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తారు.




