కరోనాతో మరణించేవారిలో వృద్ధులే ఎక్కువ!

కరోనా వైరస్‌ విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.. ఎంతగా ప్రయత్నించినా కట్టడి కావడం లేదు సరికదా రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది.. రోజూ 70 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది..

కరోనాతో మరణించేవారిలో వృద్ధులే ఎక్కువ!
Follow us

|

Updated on: Sep 02, 2020 | 4:16 PM

కరోనా వైరస్‌ విజృంభణకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది.. ఎంతగా ప్రయత్నించినా కట్టడి కావడం లేదు సరికదా రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది.. రోజూ 70 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,375 కేసులు నమోదయ్యాయి.. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,69,524కు చేరింది.. ఇప్పటి వరకు 29,01,909 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక దేశంలో 8,01,282 యాక్టివ్‌ కేసులున్నాయి.. కరోనా వైరస్‌ ఎక్కువగా 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కులనే అంటుకుంటున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.. మొత్తం కరోనా కేసులలో వీరి సంఖ్య సగాని కంటే కొంచెం ఎక్కువగానే ఉంది.. ఇక కరోనాతో మరణించినవారిలో వృద్ధులే ఎక్కువగా ఉన్నారు.. కరోనా మరణాలలో 51 శాతం మంది 60 ఏళ్లకు పైపడినవారే! వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నది అందుకే! 17 ఏళ్లలోపువారిలో కేవలం ఎనిమిది శాతం కేసులే నమోదయ్యాయి.. మరణాల శాతం కూడా చాలా తక్కువ.. 18 నుంచి 25 ఏళ్ల వయసు వారిలో 14 శాతం కేసులుంటే, ఒక శాతం ప్రాణాలు కోల్పోతున్నారు. 26 నుంచి 44 ఏళ్ల వయసున్నవారిలోనే అత్యధికంగా 40 శాతం కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 11 శాతం మంది మరణిస్తున్నారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కోవిడ్‌ నియమాలను కచ్చితంగా పాటించాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరుతున్నది.. ఇంటి నుంచి బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలంటూ సూచిస్తోంది. చేతులను తరచుగా శుభ్రం చేసుకోవాలని, భౌతిక దూరాన్ని పాటించాలని చెబుతోంది. ప్రజలు నిబంధనలను పాటిస్తే కరోనా వైరస్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని అంటోంది.