బీహార్‌లో మొదలైన ఎన్నికల సందడి- ఎన్‌డీఏ వైపుకొచ్చిన మాంఝీ
బీహార్‌లో ఎన్నికల సందడి మొదలయ్యింది.. రాజకీయ నేతలు తమ భవిష్యత్తు భద్రంగా ఉండటం కోసం ముందు జాగ్రత్త పడుతున్నారు.. అక్కడ ఇప్పటికే కప్పదాట్లు మొదలయ్యాయి.. ఆర్‌జేడీ నుంచి జేడీయూకు వలసలు మొదలయ్యాయి.
బీహార్‌లో ఎన్నికల సందడి మొదలయ్యింది.. రాజకీయ నేతలు తమ భవిష్యత్తు భద్రంగా ఉండటం కోసం ముందు జాగ్రత్త పడుతున్నారు.. అక్కడ ఇప్పటికే కప్పదాట్లు మొదలయ్యాయి.. ఆర్‌జేడీ నుంచి జేడీయూకు వలసలు మొదలయ్యాయి.. ఈసారి టికెట్ దొరకడం కష్టమేనని అనుకుంటున్న జేడీయూ నేతలు ఆర్‌జేడీ తీర్థం పుచ్చుకుంటున్నారు.. ఊహించినట్టుగానే హిందుస్తానీ అవామ్ మోర్చా- హెచ్‌ఏఎమ్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఎన్‌డీఏ కూటమిలో చేరేందుకు సంసిద్ధులయ్యారు.. జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో సంప్రదింపులు కూడా జరిపారు.. హెచ్‌ఏఎమ్‌కు తొమ్మిది స్థానాలు ఇచ్చేందుకు జేడీయూ కూడా అంగీకరించింది.. రేపోమాపో ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన రాబోతున్నది. తాము జేడీయూ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తామే తప్ప ఆ పార్టీలో తమ పార్టీని విలీనం చేయబోమని హెచ్‌ఏఏమ్ అధికార ప్రతినిధి దానిశ్ రిజ్వాన్ కుండబద్దలు కొట్టారు.
దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీ తీసుకుంటున్న చర్యలు అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం నితీశ్ తీసుకుంటున్న విధానాలు తమకు నచ్చాయని, అందుకే ఎన్‌డీఏ కూటమిలో చేరుతున్నామని దానిశ్ అంటున్నారు. నెల రోజుల కిందటనే ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ కూటమి నుంచి జితన్ రామ్ మాంఝీ బయటకు వచ్చారు. అప్పుడే ఆయన ఎన్‌డీఏ వైపుకు వెళతారని రూఢీ అయ్యింది.. మొదట్లో జితన్ రామ్ కూడా జేడీయూలోనే ఉండేవారు.. 2015లో అందులోంచి బయటకు వచ్చి సొంతంగా హిందూస్తాన్ అవామ్ మోర్చా పార్టీని పెట్టుకున్నారు.. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌పార్టీ కూటమిలో చేరారు.. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏకు జై కొడుతున్నారు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అధికారపక్షమైన జేడీయూకు, విపక్షమైన ఆర్‌జేడీకు సవాల్‌గా మారాయి.. ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, ఎల్‌జేపీ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిన సంగతి తెలిసిందే. నితీశ్ కుమారే తమ సీఎం అభ్యర్థి అని నడ్డా ఆల్‌రెడీ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్‌జేడీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జేడీయూ మాజీ నేత శరద్ యాదవ్‌ను కూడా మళ్లీ పార్జీలో చేర్చుకునేందుకు జేడీయూ ఉత్సాహపడుతోంది..