“నా క్రికెట్ కెరీర్‌పై షేన్ వార్న్ ప్ర‌భావం ఉంది”

షేన్ వార్న్ బౌలింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా. అత‌డిని చాలామంది యువ క్రికెట‌ర్లు రోల్ మోడ‌ల్‌గా తీసుకుంటారు. ఆ లిస్ట్‌లో భార‌త యువ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ కూడా ఉన్నాడు.

నా క్రికెట్ కెరీర్‌పై షేన్ వార్న్ ప్ర‌భావం ఉంది
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2020 | 4:04 PM

షేన్ వార్న్ బౌలింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా. అత‌డిని చాలామంది యువ క్రికెట‌ర్లు రోల్ మోడ‌ల్‌గా తీసుకుంటారు. ఆ లిస్ట్‌లో భార‌త యువ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ కూడా ఉన్నాడు. అవును.. అత‌డు త‌న క్రికెట్ కెరీర్‌పై షేన్ వార్న్ ప్ర‌భావం ఉంద‌ని చెప్తున్నాడు. త‌న బౌలింగ్ విష‌యంలో సందేహం వ‌చ్చిన ప్ర‌తిసారి..షేన్ వార్న్ బౌలింగ్ వీడియోలు చూసి త‌ప్పులు స‌రిదిద్దుకుంటాన‌ని తెలిపాడు. అలా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప‌రిణితిని పెంచుకుంటాన‌ని వివరించాడు.

2005 యాషెస్​ సిరీస్​లో వార్న్​​ బౌలింగ్​ ​చూసి తాను కూడా బౌల‌ర్ కావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చెప్పాడు కుల్దీప్. ఆ తర్వాత పుణెలో ఇండియా-ఆసిస్ టెస్టు సిరీస్​ సందర్భంగా అతడిని కలిశాన‌ని, ఆ సమయంలో స్పిన్ గురించి ఎన్నో మెలకువలు నేర్చుకున్న‌ట్లు తెలిపాడు. అలా త‌మ మ‌ధ్య చక్కని బంధం ఏర్పడిందని, ఇప్పటికీ రోజూ మేం వాట్సాప్​లో చాటింగ్ చేసుకుంటూ ఉంటామ‌ని కుల్దీప్ యాద‌వ్ పేర్కొన్నాడు. కాగా యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్​లు జరగనున్నాయి. కోల్​కతా నైట్​రైడర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు కుల్దీప్ యాద‌వ్.

Also Read :

కీల‌క‌ టోర్నీకి పీవీ​ సింధు దూరం