18,855 మందికి భారత పౌరసత్వంః కేంద్ర హోంశాఖ

ఐదేండ్లలో 18,855 మందికి భారత పౌరసత్వం లభించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.

18,855 మందికి భారత పౌరసత్వంః కేంద్ర హోంశాఖ
Follow us

|

Updated on: Sep 20, 2020 | 5:47 PM

ఐదేండ్లలో 18,855 మందికి భారత పౌరసత్వం లభించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. గరిష్ఠంగా 2015లో 15,459 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. 2016‌లో 1,076 మందికి, 2017‌లో 795 మందికి, 2018‌లో 586 మందికి, 2019‌లో 939 మందికి కలిపి 2015-19 మధ్య కాలంలో మొత్తంగా 18,855 మంది భారత పౌరసత్వం పొందినట్లు మంత్రి వివరించారు. ఈ మేరకు ఆదివారం లోక్‌సభలో సంబంధిత ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్రమంత్రి నిత్యానంద సమాధానం ఇచ్చారు.

కేరళలో లైఫ్ మిషన్ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం యూఏఈకి చెందిన రెడ్ క్రెసెంట్ నుండి విదేశీ ఆర్థిక సహాయం స్వీకరించడానికి కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదనను సమర్పించిందా అన్న ప్రశ్నకు లేదని నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. కేరళ ప్రభుత్వం నుంచి అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వానికి అందలేదని ఆయన తెలిపారు.